మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?
మార్చి 19న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 19న ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17వ తేదీ మంగళ వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం టిటిడి నిర్వహించనుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. దీంతో 16వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపింది.
అదేవిధంగా మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 18వ తేది విఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది.
