Viral Video: చొక్కాపై చొక్కా.. 30 వేసిన ఫ్లైట్‌ ప్యాసింజర్! మయసభలో ద్రౌపదిలా వస్తూనే ఉన్నాయ్.. ఫన్నీ వీడియో

కొందరికి రూల్స్‌ తప్పించుకు తిరగడానికి కోటి ఐడియాలు ఇట్టే వస్తాయ్‌..! వాళ్ల తెలివి తేటల ముందు ఏఐ పరిజ్ఞానం కూడా వేస్ట్.. అనిపించేలా వుంటాయ్‌. రోజు రోజుకు కొత్త కొత్త ఐడియాలతో అధికారులను బురిడీ కొట్టించి ఎంచక్కా వాళ్లదారిన వాళ్లు పోతుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా ఓ విమానంలో చోటు చేసుకుంది. సాధారణంగా విమానం ఎక్కే ప్యాసింజర్లు.. తమతో ఎంత ఎక్కువ లగేజీ తీసుకెళ్తే అంత ఫీజు ఇచ్చుకోవల్సి..

Viral Video: చొక్కాపై చొక్కా.. 30 వేసిన ఫ్లైట్‌ ప్యాసింజర్! మయసభలో ద్రౌపదిలా వస్తూనే ఉన్నాయ్.. ఫన్నీ వీడియో
Flight Passenger Wore 30 Shirts
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 05, 2024 | 6:01 PM

కొందరికి రూల్స్‌ తప్పించుకు తిరగడానికి కోటి ఐడియాలు ఇట్టే వస్తాయ్‌..! వాళ్ల తెలివి తేటల ముందు ఏఐ పరిజ్ఞానం కూడా వేస్ట్.. అనిపించేలా వుంటాయ్‌. రోజు రోజుకు కొత్త కొత్త ఐడియాలతో అధికారులను బురిడీ కొట్టించి ఎంచక్కా వాళ్లదారిన వాళ్లు పోతుంటారు. ఇలాంటి సంఘటనే తాజాగా ఓ విమానంలో చోటు చేసుకుంది. సాధారణంగా విమానం ఎక్కే ప్యాసింజర్లు.. తమతో ఎంత ఎక్కువ లగేజీ తీసుకెళ్తే అంత ఫీజు ఇచ్చుకోవల్సి ఉంటుంది. అందుకే విమాన ప్రయాణం చేసే వారు తమతో వీలైనంత తక్కువ లగేజీ తీసుకెళ్తుంటారు. పరిమితంగా ఇన్ని కిలోల కంటే ఎక్కువ తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంటుంది. లేదంటే.. చచ్చినట్లు అదనపు ఛార్జీలు చెల్లించాలి.

అందుకే కొందరు ప్రయాణికులు అదనపు లగేజీ ఛార్జీలను తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి తనతోపాటు అధికంగా దుస్తులు తీసుకెళ్లవల్సి వచ్చింది. అయితే వాటి బరువుకు తగిన డబ్బు చెల్లించేందుకు అతగాడు సిద్ధంగా లేదు. దీంతో ఓ విచిత్ర స్కెచ్‌ వేశాడు. ఏకంగా చొక్కా పై చొక్కా.. ప్యాంట్ పై ప్యాంట్ ధరించి ఏకంగా 30 జతల బట్టలు ధరించాడు. ఆ తర్వాత ఖాళీ బ్యాగు తీసుకుని ఊపుకుంటూ విమానం ఎక్కేశాడు. ఇక సీట్లో కూర్చునే సమయంలో అవన్నీ విప్పి లగేజీ బాక్సులో సర్దేసి హమ్మయ్యా.. అనుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోలో ఓ భారీ జాకెట్ వేసుకున్న ప్యాసెంజర్ లగేజి బ్యాగ్ ఫ్లైట్ లోకి ఎంటరవడం కనిపిస్తుంది. అందరిలాగా మామాలుగానే లగేజి బ్యాగ్ పైన ఉన్న ఓవర్‌హెడ్ బిన్‌లో పెట్టాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ఇవి కూడా చదవండి

ముందు తాను వేసుకున్న జాకెట్ విప్పి లగేజి బిన్‌లో పెట్టాడు. కంఫర్ట్ గా ఉండదని జాకెట్ తీసేసాడేమెనని తోటి పాసెంజర్లు అనుకున్నారు. ఆ తరవాత ఒకదాని తర్వాత ఒకటిగా మయసభలో ద్రౌపది చీరల మాదిరి వరుసగా చొక్కాలు విప్పుతూనే ఉన్నాడు. ఇలా దాదాపు 30 జతల వరకు విప్పి లగేజి బిన్‌లో కుక్కేశాడు. అదే ఫ్టైట్‌లో ఉన్న తోటి పాసెంజర్లంతా ఇతగాడి తెలివి తేటలకు అవాక్కయ్యారు. కొందరు దీనిని తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా.. నెట్టింట వైరల్‌గా మారింది. అతని తెలివితేటలు చూసి నెటిజన్లు వీడు లెజెండ్‌ రా బుజ్జీ.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్రిక్ బలేగా ఉందే.. మనం కూడా ఫాలో అయితేపోలా.. అంటూ కామెంట్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో మీరూ చూసేయండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.