AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆస్ట్రియా గడ్డపై తొలిసారిగా.. కీలక ట్వీట్..

ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ముందుగా రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్వహించే 22వ వార్షిక సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కు ఇతరు అగ్రదేశాలు కూడా ప్రతినిథ్యం వహిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ తరువాత తొలిసారి ఆస్ట్రియా పర్యటన చేపట్టనున్నారు ప్రధాని మోదీ. ఇంధనం, దేశ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు ఆకర్షణ, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకంతోపాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

PM Modi: రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. ఆస్ట్రియా గడ్డపై తొలిసారిగా.. కీలక ట్వీట్..
Pm Modi
Srikar T
|

Updated on: Jul 08, 2024 | 1:39 PM

Share

ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ముందుగా రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడ నిర్వహించే 22వ వార్షిక సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ కు ఇతరు అగ్రదేశాలు కూడా ప్రతినిథ్యం వహిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ తరువాత తొలిసారి ఆస్ట్రియా పర్యటన చేపట్టనున్నారు ప్రధాని మోదీ. ఇంధనం, దేశ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు ఆకర్షణ, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకంతోపాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రెండు దేశాల పరస్పర సహాయ సహకారాలపై దృష్టిపెట్టనున్నారు. గత పదేళ్లలో భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఇండియా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు పీఎం మోదీ.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ను తన స్నేహితుడిగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఆయనతో భేటీ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. అలాగే రష్యా – భారత్‎లో మరింత అభివృద్ది జరిగేలా, శక్తివంతమైన భారతీయ సమాజాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పించేలా కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక ఆస్ట్రియాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌లను కలిసే అవకాశం ఉంది. ఆస్ట్రియా, భారత్ కు అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి అని తనకు పూర్తి నమ్మకం ఉందని పీఎం మోదీ ధీమా వ్యక్తం చేశారు. అనేక దేశాల భాగస్వామ్యాలను గుర్తించి తమతో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా అనేక కొత్త ఆవిష్కరణలు, సాంకేతికత రంగాలలో అభివృద్ధి చెందేందుకు కలసి లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. భారతీయుల వృత్తినైపుణ్యానికి తగిన ప్రధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు ప్రధాని మోదీ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..