AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రెప్పపాటులో రోడ్డుమధ్యలో ఏర్పడిన భారీ గుంత.. ఉబికి వచ్చిన గంగాజలం! దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత కొజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రహదారులు నీటితో నిండిపోయి రవాణాకు ఇబ్బందికరంగా మారాయి. మరికొన్ని చోట్ల వరదల నీటి ఉధృతికి కొత్తగా వేసిన రోడ్లు సైతం కొట్టుకుపోయాయి. తాజాగా ముజఫర్‌నగర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి చూస్తుండగానే..

Watch Video: రెప్పపాటులో రోడ్డుమధ్యలో ఏర్పడిన భారీ గుంత.. ఉబికి వచ్చిన గంగాజలం! దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Canal Water Floods Passed Under Road
Srilakshmi C
|

Updated on: Jul 08, 2024 | 11:37 AM

Share

లక్నో, జులై 8: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత కొజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల రహదారులు నీటితో నిండిపోయి రవాణాకు ఇబ్బందికరంగా మారాయి. మరికొన్ని చోట్ల వరదల నీటి ఉధృతికి కొత్తగా వేసిన రోడ్లు సైతం కొట్టుకుపోయాయి. తాజాగా ముజఫర్‌నగర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి చూస్తుండగానే.. కాలువ నీటి కారణంగా రోడ్డు మధ్యలోకి అమాంతం విరిగిపోయింది. రోడ్డు కింది నుంచి కాలువ ఉధృతంగా పారడంతో క్షణాల్లోనే రోడ్డు రెండుగా చీలి పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో కొత్త వేసిన రోడ్డు కనిపిస్తుంది. ఓవైపు రోడ్డుపై కొందరు వాహన దారులు.. తామున్న చోటే వాహనాలు నిలిపివేసి చూస్తుంటారు. మరోవైపు వీడియో తీస్తున్న వ్యక్తి రోడ్డును తదేకంగా చూస్తుంటాడు. అనంతరం రెప్పపాటులో రోడ్డు మధ్యలో ఒక పెద్ద గుంత ఏర్పడటం వీడియోలో చూడొచ్చు. గుంత కింద నుంచి వర్షం నీళ్లు ఉదృతంగా పారడం వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తుండగానే నీటి ప్రవాహం రోడ్డుపై మిగిలిన భాగాన్ని కూడా కూలగొడుతుంది. దీంతో రోడ్డు రెండుగా విభజించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో వీడియో తీస్తున్న వ్యక్తి ‘భాయ్ షాబ్! పిచ్చే హట్ జావో’ (బ్రదర్‌..! దూరంగా ఉండండి) అంటూ వీడియో తీస్తున్న వ్యక్తి రోడ్డుకి అవతల వైపున్న ప్రయాణికులను హెచ్చరించడం వీడియోలో వినవచ్చు.

ఇవి కూడా చదవండి

త వీడియోను జర్నలిస్ట్‌ సచిన్ గుప్తా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘కళ్ల ముందే కూలిన ఈ రోడ్డు వీడియోను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చిత్రీకరించాం. వర్షం నీరు పొలాలపైకి పారడంతో చాలా మంది రైతుల పంటలు నాశనమయ్యాయి. ఇప్పుడు రోడ్డు కింద నుంచి నీళ్లు పారడంతో రోడ్డు కూడా ధ్వంసం అయ్యింది’ అంటూ ఈ పోస్టు కింద క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఈ వీడియోను జూలై 6న షేర్ చేయగా.. ఇప్పటి వరకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి. గ్రామస్తుల ప్రాణాలను పణంగా పెట్టారని ఒకరు, ఈ వరదల వెనుక అసలు కారణం.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వర్షం నీళ్ల పారుదల కోసం ఏ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

బదులుగా బ్రిటిష్ పాలనలో నిర్మించిన వర్షం నీటి పారుదల వ్యవస్థను నాశనం చేశారంటూ మరొక నెటిజన్‌ రాజకీయ నాయకులపై దుమ్మెత్తిపోశాడు. ప్రణాళిక లేని ప్రభుత్వ విధానాలకు ఇదొక ఉదాహరణ. రోడ్డు మధ్యలో కాలువను నిర్మించే పనులను.. ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటూ’ తిట్టిపోశాడు. ఇదిలా ఉంటే బీహార్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 12 బ్రిడ్జిలు కూలిపోవడంతో చర్చణీయాంశంగా మారింది. వర్షానికి తగ్గుకోలేక పేకమేడల్లా కూలిపోతున్న నాసిరకం బ్రిడ్జిలను నిర్మించిన 15 మంది ఇంజనీర్లను అధికారులు సస్పెండ్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.