Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: ‘నా భారత్ జోడోయాత్రకు వైఎస్ఆరే స్పూర్తి’.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఆయన మరణం అత్యంత విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేదని.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‎కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. ఆయన వారసత్వాన్ని షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Rahul Gandhi: 'నా భారత్ జోడోయాత్రకు వైఎస్ఆరే స్పూర్తి'.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్..
Rahul Gandhi
Follow us
Srikar T

|

Updated on: Jul 08, 2024 | 10:57 AM

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వైఎస్ఆర్ అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. ఆయన మరణం అత్యంత విషాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేదని.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‎కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. కష్టాలు, కన్నీళ్లు ఉండేవి కావని తెలిపారు. ఆయన వారసత్వాన్ని షర్మిల సమర్ధవంతంగా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ నమ్మకం తనకు ఉందని ధీమాను వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. వైఎస్ షర్మిల న్యాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు. వైఎస్ఆర్‎లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, న్యాయకత్వ లక్షణాలు షర్మిలలో తాను చూశానని ఈ సందర్భంగా తెలిపారు. తాను వ్యక్తిగతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. ఆయన పాదయాత్రే తన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి అని తెలిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం, వారి కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేశారని చెప్పారు. అందుకే తనకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. జూలై 8న 75 వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్‎కు ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ విస్తరించేందుకు, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్ షర్మిల అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జూలై 8 ఆయన జయంతిని పురస్కరించుకుని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు మంగళగిరిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే మరి కొందరు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ జయంతి నుంచే కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతూ కాంగ్రెస్ గెలుపుకు అనుసరించాల్సిన విధివిధానాలను దిశానిర్ధేశం చేయనున్నారు. కార్యకర్తల్లో సరికొత్త జోష్‎తో పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.