సోనియా గాంధీ
సోనియా గాంధీ భారత రాజకీయాలలో ఒక ముఖ్యమైన నాయకురాలు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా అడ్వైజ్ అల్బినా మైనో. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 9 డిసెంబర్ 1946న ఇటలీలోని విసెంజా సమీపంలో ఓ చిన్న గ్రామంలో రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. సోనియా తండ్రి పేరు స్టెఫానో మరియు తల్లి పేరు పావోలా. సోనియా తండ్రి వృత్తి రీత్యా మెకానిక్. సోనియా ఇంగ్లండ్‌లో భాషలను అధ్యయనం చేసేందుకు కేంబ్రిడ్జికి వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 1968లో పెళ్లి చేసుకున్నారు. సోనియా – రాజీవ్‌లకు ఇద్దరు పిల్లలు – రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. భర్త రాజీవ్ గాంధీ హత్యకు గురైన అనంతరం 1991లో రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ.. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్రలో అత్యధిక కాలం అధ్యక్షురాలిగా పనిచేసిన ఘనత సోనియాదే. సోనియా కూడా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు యూపీఏ ఛైర్‌పర్సన్‌గానూ ఆమె పనిచేశారు.