AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.. రాహుల్, సోనియాగాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు..

నేషనల్ హెరాల్డ్‌ కేసులో ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. చార్జిషీట్‌ దాఖలు అయిన తర్వాత- ఈ కేసులో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ‌, శామ్‌ పిట్రోడాకు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు.

National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.. రాహుల్, సోనియాగాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు..
National Herald Case
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2025 | 1:39 PM

Share

నేషనల్ హెరాల్డ్‌ కేసులో ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. చార్జిషీట్‌ దాఖలు అయిన తర్వాత- ఈ కేసులో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ‌, శామ్‌ పిట్రోడాకు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. నిందితుల తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన తల్లి, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలు నేరపూరిత ఆస్తుల ద్వారా దాదాపు 142 కోట్లు సంపాదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణ సందర్భంగా రాహుల్‌, సోనియాపై ED సంచలన ఆరోపణలు చేసింది. సోనియా, రాహుల్‌, శామ్‌పిట్రోడా, సుమన్‌ దూబే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని వివరించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా, యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు సంపాదించిందని ఈడీ తరుపున న్యాయవాదులు వివరించారు.

నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఆ సంస్థ అద్దెల ద్వారా వచ్చిన రూ.142 కోట్ల ఆదాయాన్ని.. సోనియా, రాహుల్‌ వాడుకున్నారని ఈడీ పేర్కొంది. నేరపూరితంగా వచ్చిన నిధులను స్వాధీనం చేసుకోవాలని కోరింది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల నుంచి వచ్చే అద్దె కూడా నేరం ద్వారా వచ్చిందే.. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ పేర్కొంది. నేరపూరిత చర్య ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తుంటే.. దాన్ని మనీలాండరింగ్‌గా పరిగణించాలని కోరింది. సోనియా, రాహుల్‌ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్డుకు తెలిపింది.

ఇంతలో, ఈ కేసులో తన ఛార్జిషీట్ కాపీని బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామికి అందించాలని న్యాయమూర్తి EDని ఆదేశించారు. ఆయన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ED ప్రస్తుత కేసును నమోదు చేసింది. ఈ కేసులో వాదనలు ప్రస్తుతం జరుగుతున్నాయి.

జూన్ 26, 2014న స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.. 2021లో తన దర్యాప్తును ప్రారంభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..