Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ వర్కంగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత, ముస్లిం, బ్రాహ్మణుల మధ్య చిక్కుకుపోయామని, ఓబీసీలు మమ్మల్ని విడిచిపెట్టారని రాహుల్ గాంధీ అన్నారు. మనం ముస్లింల గురించి మాట్లాడుకుంటాం. అందుకే మమ్మల్ని తరచుగా ముస్లిం మద్దతుదారులు అని పిలుస్తారు. దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదని రాహుల్ గాందీ స్పష్టం చేశారు.

అహ్మదాబాద్‌ కాంగ్రెస్‌ వర్కంగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Ahmedabad Cwc Meeting
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 08, 2025 | 9:56 PM

సర్ధార్‌ పటేల్‌కు నిజమైన వారసులం తామేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత గడ్డపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. దళిత, బ్రాహ్మణ, మైనారిటీ ఓటుబ్యాంక్ కోసం మనం కొట్టుమిట్టాడుతుంటే ఓబీసీలు పార్టీకి దూరమయ్యారని సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్‌గాంధీ.

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంతో పాటు బీజేపీపై పోరాట వ్యూహాన్ని చర్చించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ , నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నట్టు బీజేపీ ప్రచారం చేస్తోందని , ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకే ఆయన మెమోరియల్‌ దగ్గర ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు. సర్ధార్‌ పటేల్‌ , నెహ్రూకు మధ్య ఎంతో అనుబంధం ఉంది. వాళ్లిద్దరు ఆధునిక భారత నిర్మాతలు. మహాత్మాగాంధీ నేతృత్వంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. సర్ధార్‌ పటేల్‌ , జవహర్‌లాల్‌ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేశారని జైరాం రమేశ్ కొట్టిపారేశారు.

కాంగ్రెస్‌ వర్కంగ్‌ కమిటీ సమావేశంలో రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత , ముస్లిం. బ్రాహ్మణ ఓట్ల కోసం మనం కొట్టుమిట్టాడుతున్నామని, కాని ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమయ్యారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ దీనికి చక్కని ఉదాహరణ అని అన్నారు. 1991 నుంచి యూపీలో అధికారానికి కాంగ్రెస్‌ దూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరచుగా ముస్లింలకు మద్దతిస్తుందని ప్రచారం జరుగుతోందని , దీనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ముస్లింలకు , మైనారిటీలకు పార్టీ అండగా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు.

అహ్మదాబాద్‌లో సర్ధార్‌ వల్లభాయ్‌ మెమోరియల్‌లో ఈ సమావేశాలను కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా నిర్వహించింది. సమావేశం ముగిశాక రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేతలంతా అభివాదం చేశారు. బాబాసాహేబ్‌ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని నినాదాలు చేశారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని కాంగ్రెస్‌ నేతలు సందర్శించారు.

సర్టార్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలను కాంగ్రెస్‌ ఘనంగా నిర్వహిస్తుందన్నారు జైరాం రమేశ్‌.. గుజరాత్‌లో ముఖ్యంగా అహ్మదాబాద్‌లో CWC , AICC విస్తృత స్థాయి సమావేశాలకు ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని పటేల్‌ తీవ్రంగా వ్యతిరేకించారని అన్నారు. బీజేపీ నేతలు మాత్రం పటేల్‌కు , నెహ్రూకు విభేధాలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్ధార్‌ పటేల్‌ నిజమైన వారసులం తామేనని, నెహ్రూ, పటేల్ ఇద్దరు వ్యక్తులు ఆధునిక భారతదేశ నిర్మాతలు , వారు మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పీఎఫ్ విత్‌డ్రాపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!
పీఎఫ్ విత్‌డ్రాపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..!
ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరితే టైటిల్ ఖాయం! రాయుడు షాకింగ్ కామెంట్స్
ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరితే టైటిల్ ఖాయం! రాయుడు షాకింగ్ కామెంట్స్
ముంబై vs సన్‏రైజర్స్.. స్టేడియంలో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.
ముంబై vs సన్‏రైజర్స్.. స్టేడియంలో దర్శనమిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.
IPLలో బిగ్గెస్ట్‌ ఫ్రాడ్‌.. రూ.100 కోట్లు దొబ్బేసి..
IPLలో బిగ్గెస్ట్‌ ఫ్రాడ్‌.. రూ.100 కోట్లు దొబ్బేసి..
మే 1 నుండి టోల్ ట్యాక్స్‌ నియమాలు మారుతాయా? కీలక అప్‌డేట్‌!
మే 1 నుండి టోల్ ట్యాక్స్‌ నియమాలు మారుతాయా? కీలక అప్‌డేట్‌!
థర్డ్ పార్ట్‌కు రెడీ అవుతున్న దృశ్యం.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు.
థర్డ్ పార్ట్‌కు రెడీ అవుతున్న దృశ్యం.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు.
ఇద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైన చిలుక జ్యోష్యం!
ఇద్దరి మధ్య పెద్ద గొడవకు కారణమైన చిలుక జ్యోష్యం!
జిమ్‌కు వచ్చేవారిని స్టెరాయిడ్స్‌కు బానిసలుగా మారుస్తూ..
జిమ్‌కు వచ్చేవారిని స్టెరాయిడ్స్‌కు బానిసలుగా మారుస్తూ..
సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో నయా ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారంతే
సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో నయా ఫోన్ లాంచ్.. ధర తెలిస్తే షాకవుతారంతే
స్టార్‌లింక్ భారతదేశానికి రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?
స్టార్‌లింక్ భారతదేశానికి రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?