AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Ananthan: కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత..

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమారి అనంతన్ (93) బుధవారం (ఏప్రిల్ 9, 2025) తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుమారి అనంతన్.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Kumari Ananthan: కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత..
Kumari Ananthan Passed Away
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 09, 2025 | 12:14 PM

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమారి అనంతన్ (93) బుధవారం (ఏప్రిల్ 9, 2025) తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూశారు. అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుమారి అనంతన్.. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 1977లో నాగర్‌కోయిల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతన్ ఐదుసార్లు తమిళనాడు అసెంబ్లీ సభ్యుడిగా పనిచేశారు. అనంతన్ తమిళ రచయితగా, ప్రముఖ వక్తగా, రాజకీయ నేతగా ఎనలేని ముద్రవేసుకున్నారు. కుమారి అనంతన్ మృతిపట్ల తమిళిసై సౌందరరాజన్ తోపాటు.. పలువురు నేతలు నివాళులర్పించారు. సాలిగ్రామంలోని ఆయన కుమార్తె ఇంటి దగ్గర అంతిమ నివాళులర్పించడానికి అనంతన్ భౌతికకాయాన్ని సందర్శన కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరగనున్నాయి..

1933 మార్చి 19న కన్యాకుమారి జిల్లా కుమారిమంగళంలో జన్మించిన అనంతన్‌కు తమిళం అంటే ఎనలేని ప్రేమ. రచయిత, ప్రతిభావంతులైన వక్త. ఆయనకు తమిళ సాహిత్యంలో మంచి పట్టు ఉంది. ఆయన చాలా పుస్తకాలు రాశారు. ఆయన తమిళనాడులో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడు.. అనంతన్, విల్లు పట్టు వాది అయిన తన తండ్రి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నప్పటి నుండి సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. తన జన్మస్థలం పట్ల ప్రేమతో తన పేరుకు ‘కుమారి’ అని జోడించుకున్నారు.. అందుకే.. ఆయన్ను కుమారి అనంతన్ అని పిలుస్తారు.

దివంగత కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి కె. కామరాజ్ తో ఆయనకున్న అనుబంధంతో ఆయనకు యువజన కాంగ్రెస్ బాధ్యతలు దక్కాయి.. 1977లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో తమిళంలో ప్రశ్నలు అడిగే హక్కును మొదట పట్టుబట్టి పొందినది అనంతన్ మాత్రమే.. ఆ తరువాత ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కుమారి అనంతన్ సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం 2024లో రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవమైన తగైసల్ తమిజార్ అవార్డుతో ఆయనను సత్కరించింది. 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కామరాజర్ అవార్డును ప్రదానం చేసింది.

అయితే.. అనంతన్ 1980లో గాంధీ కామరాజ్ దేశీయ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీని స్థాపించారు.. కానీ అది విజయవంతం కాలేదు. తరువాత అతను మార్చి 2001లో తొండర్ కాంగ్రెస్‌ను ప్రారంభించారు.. ఎన్నికల్లో ఓటమి తరువాత, అతను ఆ పార్టీను కాంగ్రెస్‌లో విలీనం చేశారు.. ఆయన వ్రాసిన పుస్తకాలలో నీంగళం పెచాలరాగళం (మీరు కూడా వక్త కావచ్చు), సెంబనై నాడు, పారాతీర పాడియ భారతి, నిలిత పుఘలుడైయోర్.. ఎంతో పేరును గడించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..