Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 Delhi Election 2025 Results Highlights: ఓటమిని అంగీకరించిన కేజ్రీ.. దిల్లీలో అభివృద్ధి గెలిచిందన్న మోదీ

Balaraju Goud

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 08, 2025 | 6:09 PM

 Delhi Election 2025 Results Highlights: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 26ఏళ్ల తర్వాత 48శాతం ఓట్‌ షేర్‌తో 45కి పైగా సీట్లు గెలిచింది. ఇటు 43 శాతం ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 20కి పైగా సీట్లు సాధించగా...7 శాతం ఓట్ షేర్‌తో సున్నా సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్. బీజేపీ విక్టరీ కన్ఫమ్‌ అయ్యింది. ఇక ఇప్పుడు అందరి చూపు సీఎం ఎవరనే దానిపైనే.

 Delhi Election 2025 Results Highlights: ఓటమిని అంగీకరించిన కేజ్రీ.. దిల్లీలో అభివృద్ధి గెలిచిందన్న మోదీ
Delhi Election Result 2025

 Delhi Results: మధ్య తరగతికి మండింది. ఆప్‌కి మూడింది. అయితే ఆ మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌…బీజేపీకి ఎలా కలిసొచ్చాయి? 27 ఏళ్ల తర్వాత, ఢిల్లీ గద్దెపై కాషాయ జెండా ఎలా రెపరెపలాడింది? కేజ్రీవాల్ ఘోర పరాజయానికి కారణం, బీజేపీ ఘన విజయానికి కారణం..ఒకేఒక్కటి. అదే మధ్యతరగతి ఓటర్ల షిఫ్ట్‌. దశాబ్ద కాలంగా ఆమ్‌ ఆద్మీతోనే సాగుతున్న మధ్యతరగతి ఓటర్లు…ఈసారి కాషాయ పార్టీ వైపు మళ్లారు. అదే ఆప్‌ కోటకు బీటలు వారేలా చేసింది. వీటన్నిటికి తోడు మిడిల్ క్లాస్‌కు భారీ ఊరటనిచ్చిన ఐటీ మినహాయింపుల ప్రభావం కూడా కనిపించింది. బీజేపీ సంధించిన బడ్జెట్ బాణంతో ఆప్‌ విలవిల్లాడిపోయింది. ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ కోసం టీవీ9ను ఫాలో అవ్వండి..

మరిన్ని ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్, జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Delhi Counting, Delhi Results,

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Feb 2025 04:59 PM (IST)

    పొత్తు ఫెయిల్ కావడంతో ఇండి కూటమికి మరింత డ్యామేజ్…

    – కలసి ఉంటే కలదు సుఖం.. ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమంటారు. రాజకీయాల్లోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. టఫ్ ఫైట్ ఉన్న చోట కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం, కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఎన్నో సందర్భాల్లో చూశాం. అదే సమయంలో పొత్తులు పెట్టుకోకుండా సింగిల్‌గా వెళ్లి తీవ్ర పోటీలో చిత్తయిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్-ఆప్ పరిస్థితి అలాగే ఉంది.

    – ఇక ఇండియా కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్‌కు నష్టం కలిగించిందని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్‌ ముందుకొచ్చినా.. అందుకు కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. దాదాపు 7శాతానికి పైగా ఓటింగ్‌ను దక్కించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాంగ్రెస్‌ ఎంతో కొంత చీల్చడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. ఆప్‌, కాంగ్రెస్‌కి కలిపి 50శాతం వరకు ఓట్లు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48శాతం ఓట్లతో 40కి పైగా సీట్లను గెలుచుకుంది. బీజేపీ కంటే ఇండియా కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీచేయడం వల్ల గెలుపు సాధ్యంకాలేదు.

  • 08 Feb 2025 04:54 PM (IST)

    ఆప్‌ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదరుదెబ్బ

    దిగ్గజాలు అవుట్. యస్‌…ఆప్‌ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఎదరుదెబ్బ తగిలింది. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, సత్యేంద్రజైన్ సహా పలువురు కీలక నేతలు ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌వర్మ చేతిలో 4,089 ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓడించారు. ఇటు జంగ్‌పురాలో మనీష్‌ సిసోడియా ఓటమి పాలయ్యారు. 675 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి తర్విందర్‌సింగ్‌ చేతిలో మనీష్‌ సిసోడియా ఓడిపోయారు. ఇటు షాకూర్ బస్తీలో మరో కీలక నేత సత్యేంద్ర జైన్ కూడా ఓటమి పాలయ్యారు. అయితే ఈ ముగ్గురు నేతలు లిక్కర్‌ స్కామ్‌లో జైలుకెళ్లినవారే.

    – ఇటు కాస్తలో కాస్త ఆప్ పార్టీకి ఊరట కలిగిస్తూ కల్కాజీ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ… అతి కష్టం మీద విజయకేతనం ఎగురవేశారు. 9వ రౌండ్‌ వరకూ వెనుకంజలో ఉన్న అతిశీ.. 10 రౌండ్‌ నుంచి ముందుంజలోకి వచ్చి విజయం సాధించారు. మొత్తంగా ఉద్దండుల పరాజయంతో ఆప్‌లో అంతర్మథం మొదలైంది.

  • 08 Feb 2025 04:46 PM (IST)

    నార్త్‌లో హస్తంపార్టీ తుడిచిపెట్టుకుపోయిందా…?

    కాంగ్రెస్‌ పని ఖేల్‌ ఖతం అయినట్లేనా…? నార్త్‌లో హస్తంపార్టీ తుడిచిపెట్టుకుపోయిందా…? ఢిల్లీ ఫలితాల తర్వాత ఇవే అంశాలపై చర్చ ఉపందుకుంది. ఇక ఢిల్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్‌.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశే మిగిలింది. పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా… కనీస నాలుగైదు స్థానాల్లోనైనా గెలవలేకపోయింది. పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు విస్తృత ప్రచారం నిర్వహించినా ఫలితం శూన్యం అయ్యింది.

  • 08 Feb 2025 04:26 PM (IST)

    సీఎం రేసులో ఉంది ఎవరు…?

    న్యూఢిల్లీ సెగ్మెంట్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ CM రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నారు. సీఎం పదవిపై ఆయన ఇప్పటివరకూ ఎలాంటి కామెంట్‌ చేయనప్పటికీ… అమిత్‌ షా ఇంటికెళ్లి ఆయన్ను కలవడంతో పర్వేష్‌ వర్మనే సీఎం అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.

  • 08 Feb 2025 04:01 PM (IST)

    ఢిల్లీ ఫలితాలపై స్పందించిన ప్రియాంక గాంధీ

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రజలు మార్పు కోరుకుని ఓటు వేశారని అన్నారు. గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

  • 08 Feb 2025 03:31 PM (IST)

    దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ

    ఢిల్లిలో అభివృద్ధి, సుపరిపాలనే గెలిచాయని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి తాము ఏ చాన్స్ వదులుకోబోమని హామీ ఇస్తున్నట్లు మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ఢిల్లీ కీ రోల్ పోషిస్తుందని చెప్పారు. ఈ భారీ విజయం కోసం పగలు, రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరిని అభినందిస్తున్నట్లు మోదీ రాసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సేవ చేయడానికి మరింత బలంగా అంకితభావంతో ముందుకు సాగుతామని మోదీ తెలిపారు.

  • 08 Feb 2025 03:26 PM (IST)

    ఓటమిని అంగీకరించిన కేజ్రీ.. దిల్లీలో అభివృద్ధి గెలిచిందన్న మోదీ

    మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఫలితాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన కేజ్రీవాల్‌, ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం ఆతీశీ తెలిపారు. తనను గెలిపించిన కాల్కాజీ నియోజక వర్గ ప్రజలకు అతీశీ ధన్యవాదాలు చెప్పారు.

    మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

  • 08 Feb 2025 01:19 PM (IST)

    సీఎం అతిషి విజయం

    ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి, ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి విజయం సాధించారు. మర్లెనా కల్కాజీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) రమేష్ బిధూరిపై 3,500 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 08 Feb 2025 12:51 PM (IST)

    Kindle Result: ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం

    కొండ్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించారు.

  • 08 Feb 2025 12:48 PM (IST)

    Jagpura Result: 600 ఓట్లతో మనీష్ సిసోడియా ఓటమి

    జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటమిపాలయ్యారు. “పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారు, మేమందరం కష్టపడి పనిచేశాం. ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు, కానీ 600 ఓట్ల తేడాతో ఓడిపోయానంటూ ఓటమిని అంగీకరించారు మనీష్ సిసోడియా. గెలిచిన అభ్యర్థికి అభినందనలు తెలిపారు.

  • 08 Feb 2025 12:45 PM (IST)

    New Delhi Result: ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భంగపాటు

    ఢిల్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ న్యూడిల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1200 పైచిలుకు ఓట్ల తేడాతో ఆయనపై బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ విజయం సాధించారు.

  • 08 Feb 2025 12:44 PM (IST)

    సంబరాల్లో కమల దళం..!

    ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకెళ్తుంది బీజేపీ. మొత్తం 70 సీట్లలో 45సీట్లకు పైగా ఆధిక్యంలో ఉంది. 12 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన ఆప్ అధికారానికి దూరమైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారం చేపట్టబోతుంది. దీంతో.. కమలం శ్రేణుల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి. పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు కమలం నేతలు.

  • 08 Feb 2025 12:39 PM (IST)

    పూర్తి అధిక్యం దిశగా బీజేపీ

    ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయం దిశగా పయనిస్తోంది. గంట గంటకు ఆధిక్యం పెరుగుతోంది. ఎన్నికల సంఘం ప్రకారం, బిజెపి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరవ లేదు.

  • 08 Feb 2025 12:37 PM (IST)

    ఆప్ ఓటమిపై అన్నాహజారే కీలకవ్యాఖ్యలు

    ఆమ్‌ఆద్మీ ఓటమిపై కేజ్రీవాల్‌ మాజీ గురువు అన్నాహజారే స్పందించారు. కేజ్రీవాల్‌ చేసిన తప్పులేంటో ఆయన వివరించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే అన్నారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్నారు. లిక్కర్‌ స్కామ్‌తో కేజ్రీవాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని తెలిపారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారని అన్నా హజారే వెల్లడించారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలన్నారు. క్యారెక్టర్‌ లేనివారికి ఆమ్‌ఆద్మీ టికెట్లు ఇచ్చింది. అందుకే ఆప్‌ అభ్యర్థులను ప్రజలు తిరస్కరించారని అన్నాహజారే అన్నారు

  • 08 Feb 2025 12:29 PM (IST)

    సాయంత్రం బీజేపీ కార్యాలయానికి ప్రధాని మోదీ

    ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 7:45 గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని వస్తారని పీఎంవో కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

  • 08 Feb 2025 12:11 PM (IST)

    మరింత వెనుకబడ్డ కేజ్రీవాల్!

    9 రౌండ్లు ముగిసేసరికి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ 1170 ఓట్ల ఆధిక్యం.

  • 08 Feb 2025 11:28 AM (IST)

    ముఖ్యమంత్రితో సహా ముగ్గురు మంత్రులు వెనుకంజ

    కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి కంటే అతిషి 2,800 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి సౌరభ్ భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ కంటే 2,721 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు. బాబర్‌పూర్ స్థానం నుంచి గోపాల్ రాయ్ 20,750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి చెందిన అనిల్ వశిష్ట రెండవ స్థానంలో ఉన్నారు. బల్లిమారన్ స్థానం నుండి ఇమ్రాన్ హుస్సేన్ 15,302 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి చెందిన కమల్ బాగ్రీ రెండవ స్థానంలో ఉన్నారు. సుల్తాన్‌పూర్ మజ్రా స్థానం నుంచి ముఖేష్ అహ్లావత్ 6,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీకి చెందిన కరం సింగ్ రెండవ స్థానంలో ఉన్నారు. నంగ్లోయ్ జాట్ స్థానం నుంచి రాఘవేంద్ర షౌకీన్ 10,765 ఓట్ల వెనుకబడి ఉన్నారు. ఇక్కడ బీజేపీకి చెందిన మనోజ్ షౌకీన్ ముందంజలో ఉన్నారు.

  • 08 Feb 2025 11:19 AM (IST)

    Delhi Kalkaji Results: సీఎం అతిషి వెనుకంజ

    కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో నాల్గవ రౌండ్ కౌంటింగ్ పూర్తైంది. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధురి 1,635 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ప్రస్తుతం వెనుకబడి ఉన్నారు.

  • 08 Feb 2025 11:16 AM (IST)

    Delhi Results: మోదీ హామీపై పేద ప్రజలకు నమ్మకం ఉందిః సుధాంశు త్రివేది

    ప్రస్తుత ట్రెండ్స్‌పై బీజేపీ ఎంపీ సుధాంషు త్రివేది స్పందించారు. తుది ఫలితాల కోసం వేచి ఉన్నామని అన్నారు. తుది ఫలితాలు బీజేపీకి అనుకూలంగా మరింత మెరుగ్గా, నిర్ణయాత్మకంగా ఉంటాయని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై ప్రజలు ఎంత నమ్మకం ఉంచారో దీన్ని బట్టి తెలుస్తుందన్నారు. ప్రస్తుత ఫలితాలు బీజేపీకి సానుకూలం. ఢిల్లీ ప్రజలు ప్రయోగాత్మక రాజకీయాలతో విసిగిపోయారు. మోదీ హామీపై పేద ప్రజలకు నమ్మకం ఉందన్నారు.

  • 08 Feb 2025 11:13 AM (IST)

    New Delhi Result Update: మళ్లీ వెనుకంజలో కేజ్రీవాల్

    న్యూఢిల్లీ నియోజకవర్గ గణాంకాలు ప్రతి క్షణం మారుతున్నాయి. ఇక్కడ 6 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 225 ఓట్ల వెనుకబడి ఉండగా, బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Feb 2025 10:59 AM (IST)

    Delhi Results 2025: 14 స్థానాల్లో రెండు పార్టీల మధ్య తేడా 3,000

    జనక్‌పురి అసెంబ్లీ స్థానంలో రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆశిష్ సూద్ దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తిలక్ నగర్ నుంచి ఆప్ అభ్యర్థి జర్నైల్ సింగ్ మూడు రౌండ్ల తర్వాత 11,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మాదిపూర్ నుండి రాఖీ బిర్లా 42 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మోతీ నగర్ నుంచి బీజేపీకి చెందిన హరీష్ ఖురానా 2,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హరి నగర్ లో బీజేపీకి చెందిన శ్యామ్ శర్మ 5,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మూడవ రౌండ్ తర్వాత నంగ్లోయ్ నుండి బీజేపీ అభ్యర్థి 3,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Feb 2025 10:55 AM (IST)

    ఢిల్లీలో ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ

    10 సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా

    కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ

    14 స్థానాల్లో రెండు పార్టీల మధ్య 3,000 ఓట్ల తేడా

    రౌండ్‌ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ

    ఐదు రౌండ్ల తర్వాత కేజ్రీవాల్‌ లీడ్‌ 386 ఓట్లు

    జంగ్‌పురాలో సిసోడియాకు 2,345 ఓట్ల ఆధిక్యం

  • 08 Feb 2025 10:53 AM (IST)

    Delhi Election Result: ఫలితాలపై వెరైటీగా స్పందించిన ప్రియాంక గాంధీ

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ‘‘ఫలితాలు నాకు తెలియదు, నేను ఇంకా ఫలితాలను చూడలేదు’’ అని ప్రియాంక అన్నారు.

  • 08 Feb 2025 10:47 AM (IST)

    Mustafabad Result: మోహన్ బిష్ట్ 21 వేల ఓట్ల ఆధిక్యం

    ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ముస్తఫాబాద్ స్థానం నుండి నాల్గవ రౌండ్ లెక్కింపు పూర్తైంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి చెందిన మోహన్ సింగ్ బిష్ట్ 21,286 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, AIMIMకి చెందిన తాహిర్ హుస్సేన్ వెనుకబడి ఉన్నారు.

  • 08 Feb 2025 10:45 AM (IST)

    Delhi Kalkaji Results: ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటోందిః అల్కా లాంబా

    ఢిల్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్‌పై కల్కాజీ కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీ దోషి, ప్రజలు వారిని క్షమించరు. ఢిల్లీకి హాని చేసిన వారు నష్టపోతున్నారు. ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పుడే ఏం చెప్పలేం.. ఏదైనా జరగవచ్చని” అని అల్కా లాంబా అన్నారు.

  • 08 Feb 2025 10:41 AM (IST)

    Delhi Election Results: బీజేపీ – ఆప్ మధ్య హోరాహోరీ

    40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న ఆప్‌

    తొలి రౌండ్లలో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌, ఇప్పుడు వెనుకంజ

  • 08 Feb 2025 10:37 AM (IST)

    Delhi Results: కాంగ్రెస్-ఆప్ కలిసి ఉంటే బాగుండేది: సంజయ్ రౌత్

    ఢిల్లీ ఎన్నికల ట్రెండ్స్‌పై శివసేన యుబిటి ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. “మహారాష్ట్ర నమూనాను ఢిల్లీలో కూడా అమలు చేశారు. ఢిల్లీలో బీజేపీ గెలవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, ఆప్ కలిసి ఉంటే బాగుండేది. కాంగ్రెస్, ఆప్ లకు శత్రువు బీజేపీ. కాంగ్రెస్, ఆప్ కలిసి ఉంటే, మొదటి గంటలోనే గెలిచేవాళ్ళం” అని సంజయ్ అన్నారు.

  • 08 Feb 2025 10:28 AM (IST)

    Delhi Patparganj Result బీజేపీ అభ్యర్థికి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా షేక్‌హ్యండ్

    పట్పర్‌గంజ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి చెందిన రవీందర్ సింగ్ నేగి, సీడబ్ల్యుజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కౌంటింగ్ కేంద్రంలో ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాతో కరచాలనం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చౌదరి కూడా ఉన్నారు. పట్పర్‌గంజ్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనుకబడి ఉండగా, బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి ముందంజలో ఉన్నారు. అవధ్ ఓజా 11,989 ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్నారు.

  • 08 Feb 2025 10:22 AM (IST)

    Milkapur Result: మిల్కిపూర్‌లో 6 రౌండ్ల లెక్కింపు పూర్తి

    మిల్కిపూర్ స్థానంలో ఆరో రౌండ్ కౌంటింగ్ తర్వాత, బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాస్వాన్ 17,047 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Feb 2025 09:30 AM (IST)

    Delhi Result 2025: బీజేపీకి 50 శాతానికి పైగా ఓట్లు

    కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం, భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీకి 40 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి.

  • 08 Feb 2025 09:28 AM (IST)

    Delhi Results: బీజేపీ 15 స్థానాల్లో ఆధిక్యం

    భారత ఎన్నికల సంఘం తొలి ట్రెండ్స్‌లో, బీజేపీ 15 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ ఆధిక్యంలో ఉన్న నాలుగు స్థానాలు రాజేంద్ర నగర్ (దుర్గేష్ పాఠక్), త్రిలోక్‌పురి (అంజనా పర్చా), సీమాపురి (వీర్ సింగ్ ధింగన్), బాబర్‌పూర్ (గోపాల్ రాయ్).

  • 08 Feb 2025 09:27 AM (IST)

    Patparganj Result: రవీంద్ర సింగ్ నేగి ముందంజ

    రెండో రౌండ్ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి 5,596 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అవధ్ ఓజా వెనుకబడి ఉన్నారు.

  • 08 Feb 2025 09:24 AM (IST)

    ఢిల్లీ ముస్లిం సీట్లలో బీజేపీకి ఆధిక్యం

    ముస్లిం ప్రాంతాల్లో బిజెపి బలమైన ప్రదర్శన కనిపిస్తోంది. 12 ప్రాంతాలలో 7 చోట్ల కాషాయ పార్టీ జెండా ఎగురుతోంది.

    – ఢిల్లీలోని ముస్లిం సీట్లలో బీజేపీకి ఆధిక్యం

    – 12 స్థానాల్లో 7 చోట్ల బీజేపీకి స్పష్టమైన లీడ్‌

    – ఆప్‌, కాంగ్రెస్‌ని ఆదరించని ముస్లింలు

  • 08 Feb 2025 09:22 AM (IST)

    ఓట్‌ షేరింగ్‌లో బీజేపీ దూకుడు

    — బీజేపీకి సుమారు 51శాతం ఓట్లు

    — ఆమ్‌ఆద్మీకి 42శాతం ఓట్లు.. కాంగ్రెస్‌కి 6శాతం ఓట్లు

    — 2020తో పోలిస్తే 11శాతం పడిపోయిన ఆప్‌ ఓటింగ్‌

    — 2020తో పోలిస్తే 13శాతం ఓట్లు అధికంగా సాధించిన బీజేపీ

  • 08 Feb 2025 09:21 AM (IST)

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసం

    — మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో స్పష్టమైన మెజారిటీ

    — కాషాయం వైపు మధ్యతరగతి ప్రజల చూపు

    — కేంద్ర బడ్జెట్‌లో పన్ను మినహాయింపులకు ఓటు

    — బీజేపీకి కలిసొచ్చిన ఎన్నికల హామీలు, ఆప్‌పై వ్యతిరేకత

    — మూడుసార్లు అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీకి ఉద్వాసన

  • 08 Feb 2025 09:17 AM (IST)

    Delhi Results: బీజేపీ 6, ఆప్ 2 స్థానాల్లో ముందంజ

    ఢిల్లీలో EVM ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎన్నికల సంఘం ప్రకారం, ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ 6 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదే సమయంలో, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.

  • 08 Feb 2025 09:15 AM (IST)

    Delhi Karahwalnagar Result: కరావాల్‌లో కపిల్ మిశ్రా ముందంజ

    ఢిల్లీ కరవాల్ నగర్ స్థానం నుండి BJP అభ్యర్థి కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. ఆప్‌కు చెందిన మనోజ్ త్యాగి వెనుకబడ్డారు.

  • 08 Feb 2025 09:12 AM (IST)

    లీడ్‌లో బీజేపీ

    ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు సంబంధించి ట్రెండ్స్ వెలువడ్డాయి. ఇందులో బీజేపీ 40 సీట్లతో మెజారిటీ మార్కును దాటింది. అదే సమయంలో, ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషి వెనుకబడి ఉన్నారు. ఈ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.

  • 08 Feb 2025 08:56 AM (IST)

    Delhi Election Results Live: మెజారిటీ దిశగా బీజేపీ

    తొలి ట్రెండ్‌లలో భారతీయ జనతా పార్టీ మెజారిటీకి దగ్గరగా ఉంది. కేజ్రీవాల్-సిసోడియా వెనుకబడి ఉన్నారు. ప్రారంభ ట్రెండ్‌లలో అనుహ్యామై గణాంకాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మెజారిటీ సంఖ్యకు దగ్గరగా వస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ 20 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

  • 08 Feb 2025 08:51 AM (IST)

    ఆప్ – బీజేపీ మధ్య హోరా హోరీ

    ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ ట్రెండ్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరా హోరీగా తలపడుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండూ 28-28 స్థానాల్లో సమానంగా ఆధిక్యంలో ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 08 Feb 2025 08:48 AM (IST)

    Delhi Result: ఆప్ ఓడిపోబోతోందిః వీరేంద్ర సచ్‌దేవా

    ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కీలక వ్యాఖ్యలు చేశారు. “అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ ప్రకటనలతో ఢిల్లీలో ఆప్ ఓటమ ఖాయమైపోయిందని వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధితో ముందుకు వెళ్తారా లేదా అవినీతితో ముందుకు వెళ్తారా అని నిర్ణయిస్తారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని, ఫలితం మాకు అనుకూలంగా ఉంటుందని వీరేంద్ర సచ్‌దేవా ధీమా వ్యక్తం చేశారు.

  • 08 Feb 2025 08:44 AM (IST)

    ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యం

    కొనసాగుతున్న ఈవీఎం ఓట్ల లెక్కింపు

    బాదిలి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేంద్ర యాదవ్‌ ముందంజ

    10 ఏళ్ల తర్వాత ఒక స్థానంలో కాంగ్రెస్‌కి ఆధిక్యం కనిపించింది.

    శకూర్‌బస్తీలో ఆప్‌ అభ్యర్థి సత్యేంద్రజైన్‌ ముందంజ

  • 08 Feb 2025 08:42 AM (IST)

    ముస్లిం ప్రాంతాల్లో ఆప్‌ ఆధిక్యం

    ముస్లిం ప్రాంతాల్లో పట్టు నిలుపుకున్న ఆప్‌

    ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆప్‌కి ఆధిక్యం

    ముస్లింలు ఎక్కువగా ఉండే 10 స్థానాల్లో ఆప్‌ ముందంజ

  • 08 Feb 2025 08:41 AM (IST)

    Delhi Result: EC ఇచ్చిన డేటాలోనూ బీజేపీదే పైచేయి

    EVM ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం

    EVM ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం

    EC ఇచ్చిన డేటాలోనూ బీజేపీదే పైచేయి

    బీజేపీ 26 సీట్లు, ఆమ్‌ఆద్మీ 17 చోట్ల ఆధిక్యం

    బీజేపీ 26 సీట్లు, ఆమ్‌ఆద్మీ 17 చోట్ల ఆధిక్యం

  • 08 Feb 2025 08:39 AM (IST)

    Okhla Election Result: ఎంఐఎం వెనుకంజ

    ఓఖ్లా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఇక్కడ పోటీ చేసిన ఎఐఎంఐఎం అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. బల్లిమారన్, సీలంపూర్ మొదలైన స్థానాల్లో కూడా బీజేపీ ముందంజలో ఉంది.

  • 08 Feb 2025 08:34 AM (IST)

    Delhi Election Result: మోదీతోనే ఢిల్లీ అభివృద్ధిః పర్వేష్ వర్మ

    ఢిల్లీలో విజయంపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని దేవుడిని కోరుకున్నా అని న్యూఢిల్లీ సెగ్మెంట్‌లో కేజ్రీవాల్‌ మీద పోటీ చేసిన పర్వేష్‌ వర్మ చెప్పారు. మోదీ సహకారంతో ఢిల్లీలో అభివృద్ధి పనులు చేస్తామని పర్వేష్‌ వర్మ అన్నారు.

  • 08 Feb 2025 08:30 AM (IST)

    Delhi Election Result: 15 సీట్లలో కమలం ముందంజ

    ఢిల్లీలో పోస్టల్ బ్యాలెట్లలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీ 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 12 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

  • 08 Feb 2025 08:30 AM (IST)

    Malviya Nagar Seat Result: సోమనాథ్ భారతి ముందంజ

    మాలవీయ నగర్ స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి సోమనాథ్ భారతి ముందంజలో ఉన్నారు. 11 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నానని, ఎన్నికల గురించి, ఫలితాల గురించి ఆందోళన చెందడం లేదన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎగ్జిట్ పోల్స్ తయారు అయ్యాయని ఆరోపించిన సోమనాథ్ భారతి, ఆందోళన చెందడానికి ఏమీ లేదన్నారు.

  • 08 Feb 2025 08:26 AM (IST)

    కేజ్రీవాల్, అతిషి, సిసోడియా వెనుకంజ

    ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. ఇంతలో, అరవింద్ కేజ్రీవాల్, అతిషి, మనీష్ సిసోడియా పోటీ చేసిన స్థానాల ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ముగ్గురు తొలి ట్రెండ్స్‌లో వెనుకంజలో ఉన్నారు.

  • 08 Feb 2025 08:21 AM (IST)

    Delhi Results: ఆప్‌, బీజేపీ మధ్య హోరాహోరీ

    ఢిల్లీలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో, ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. జంగ్‌పురా స్థానం నుంచి ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా వెనుకబడి ఉండగా, బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ-10, ఆప్‌-8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

  • 08 Feb 2025 07:58 AM (IST)

    Delhi Election Result: ఢిల్లీలో కీలక స్థానాలు

    న్యూఢిల్లీ స్థానం: అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), పర్వేష్ వర్మ (బిజెపి), సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్)

    కల్కాజీ: అతిషి (ఆప్), రమేష్ బిధురి (బిజెపి), అల్కా లాంబా (కాంగ్రెస్)

    జంగ్‌పురా: మనీష్ సిసోడియా (ఆప్), తర్విందర్ సింగ్ మార్వా (బిజెపి), ఫర్హాద్ సూరి (కాంగ్రెస్)

    మాలవీయ నగర్: సోమనాథ్ భారతి (ఆప్), సతీష్ ఉపాధ్యాయ్ (బిజెపి), జితేంద్ర కుమార్ కొచ్చర్ (కాంగ్రెస్)

    ఓఖ్లా: అమానతుల్లా ఖాన్ (ఆప్), ఫిర్దోస్ ఆలం (బీజేపీ), అరీబా ఖాన్ (కాంగ్రెస్), షిఫా ఉర్ రెహమాన్ (ఎఐఎంఐఎం)

  • 08 Feb 2025 07:56 AM (IST)

    Gater Kailash Election Result: ఫలితాలకు ముందు సౌరభ్ భరద్వాజ్ పూజలు

    గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆప్ అభ్యర్థిగా సౌరభ్ భరద్వాజ్ బరిలో నిలిచారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరోసారి ఢిల్లీలో ఆప్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • 08 Feb 2025 07:53 AM (IST)

    Kalkaji Election Result: ఢిల్లీలో మార్పు జరగబోతోందిః అల్కా లాంబా

    ఓట్ల లెక్కింపుకు ముందు, కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా కీలక వ్యాఖ్యలు చేశారు. “ఢిల్లీ మార్పును కోరుకుంటుందని, ఎన్నికల ఫలితాలతో ఈ మార్పు జరగబోతోందన్నారు. పదేళ్ల క్రితం ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.’’ అల్కా లాంబా అన్నారు.

  • 08 Feb 2025 07:51 AM (IST)

    Delhi Election Results: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో మొదలు కానుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మీరాబాయి డిఎస్‌ఇయు మహారాణి బాగ్ క్యాంపస్‌లోని కౌంటింగ్ కేంద్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • 08 Feb 2025 07:47 AM (IST)

    Delhi Results 2025: పొత్తుపై హైకమాండ్‌దే తుది నిర్ణయంః సందీప్ దీక్షిత్

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుహ్యంగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. మెరుగైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తెలిపారు. అలాగే పొత్తుల గురించి ఎటువంటి సమాచారం లేదన్న ఆయన.. దీనిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ముందు అయితే ఓట్ల లెక్కింపు జరగనివ్వండి అని అన్నారు.

  • 08 Feb 2025 07:34 AM (IST)

    [Jungpura] Delhi Election Result: ఆప్ ప్రభుత్వం ఏర్పాటు – మనీష్ సిసోడియా

    జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు. ఆప్ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అభివృద్ధి, పిల్లల విద్యకు ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు.

  • 08 Feb 2025 07:32 AM (IST)

    తేలనున్న 699 మంది అభ్యర్థుల భవితవ్యం

    ఆప్, కాంగ్రెస్ పార్టీలు మొత్తం 70 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షాలు జనతాదళ్ (యునైటెడ్), లోక్‌తాంత్రిక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) లకు రెండు స్థానాలను వదిలివేసింది. మొత్తం 699 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో 603 మంది పురుషులు, 95 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. ఫిబ్రవరి 5న, 15,614,000 మంది నమోదైన ఓటర్లలో 9,451,997 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 60.50% పోలింగ్ నమోదైంది.

  • 08 Feb 2025 07:19 AM (IST)

    ఫస్ట్ ట్రెండ్స్ ఎప్పుడంటే..?

    ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ మొదలు కానుంది. అధికార ఆప్ , 1998 నుండి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ ఒకటి లేదా రెండు స్థానాలకే పరిమితం కావచ్చు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, 9:30 గంటల కల్లా తొలి ట్రెండ్స్ వెలువడతాయని భావిస్తున్నారు.

  • 08 Feb 2025 07:08 AM (IST)

    సీఎం అభ్యర్థి లేకుండానే..!

    ఈసారి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. ఉచిత విద్యుత్, నీరు, యమునా నది ప్రక్షాళన వంటి అంశాలపై ఈ ఎన్నికలకు దిగింది. అదే సమయంలో, అన్ని పార్టీలు మహిళలకు ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చాయి.

  • 08 Feb 2025 07:07 AM (IST)

    టెన్షన్ పెడుతున్న తక్కువ ఓటింగ్

    2020తో పోలిస్తే ఈసారి ఢిల్లీలో 2 శాతం తక్కువ ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 60.92 శాతం మహిళలు ఓటు వేశారు. చాలా ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకి మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నాయి. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, కాషాయ పార్టీ 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఆప్ గెలిస్తే, అది నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

  • 08 Feb 2025 07:05 AM (IST)

    మరి కాసేపట్లో ఫలితాలు..!

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందే, బీజేపీ, ఆప్ పార్టీలు రెండూ ఢిల్లీలో విజయంపై ధీమాతో ఉన్నాయి. అయితే చాలా ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశారు. అదే సమయంలో, ఢిల్లీ ఫలితాలకు ముందే అసెంబ్లీ రద్దు చేశారు.

Published On - Feb 08,2025 6:46 AM

Follow us