132 Seater Bus: రైలంత బస్సులు రయ్.. రయ్.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మరికొద్ది రోజుల్లోనే రైలంత పొడుగాటి బస్సులు భారతీయ రోడ్లపై రయ్‌మని దూసుకెళుతాయట. విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో? అని మనం అనుకుంటుంటాం. అయితే.. ఇప్పుడు ఆ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతోంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
మరికొద్ది రోజుల్లోనే రైలంత పొడుగాటి బస్సులు భారతీయ రోడ్లపై రయ్‌మని దూసుకెళుతాయట. విదేశాల్లో ఇప్పటికే ట్రైన్ తరహాలో పొడవుగా ఉండే బస్సులు అందుబాటులో ఉన్నాయి. అందులో వంద మందికి పైగా ప్రయాణం చేయొచ్చు. అవి చూసినప్పుడల్లా.. భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడు వస్తాయో? అని మనం అనుకుంటుంటాం. అయితే.. ఇప్పుడు ఆ నిరీక్షణకు త్వరలోనే చెక్ పడబోతోంది. కేంద్ర ప్రభుత్వం అటువంటి పొడవాటి బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
132 సీట్లతో కూడిన బస్సులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఇందుకోసం నాగ్‌పూర్‌లో పైలట్ ప్రాజెక్టు కొనసాగుతోందని నితిన్ గడ్కరీ చెప్పారు. తాను చెక్ రిపబ్లిక్‌కు వెళ్లినప్పుడు.. అక్కడ మూడు బస్సులు కలిపి ఒకే ట్రాలీ బస్సుగా ఉండటాన్ని తాను చూశానని అన్నారు. అలాంటి బస్సులను భారత్‌లో ఎందుకు తీసుకురాకూడదని అనిపించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చలు జరిపి, టాటా సహకారంతో నాగ్‌పుర్‌లో ఓ పైలట్ ప్రాజెక్టు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. 132 మంది కూర్చునే విధంగా బస్సును రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇంధనంతో కాకుండా బ్యాటరీతో నడిచేలా వీటిని తయారు చేస్తున్నామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

