Chicken: ప్రతి రోజూ చికెన్‌ తింటే ఏం జరుగుతుందో తెలుసా? ఈ సమస్యలు గ్యారెంటీ..

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చికెన్ తినడానికి ఇష్టపడతారు. పైగా చికెన్ రుచి కూడా ఇతర ఆహారాల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే వారం, వర్జ్యం అంటూ చూసుకోకుండా భోజన ప్రియులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగించేస్తుంటారు. చికెన్ ఆరోగ్యానికి అంత హానికరం కాదు. చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చికెన్ తినడం ద్వారా శరీరంలో శక్తి పెరుగుతుంది. చికెన్ తింటే నష్టమేమీ ఉండదు..

Srilakshmi C

|

Updated on: Jul 07, 2024 | 8:07 PM

పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ చికెన్ తినడానికి ఇష్టపడతారు. పైగా చికెన్ రుచి కూడా ఇతర ఆహారాల కంటే భిన్నంగా ఉంటుంది. అందుకే వారం, వర్జ్యం అంటూ చూసుకోకుండా భోజన ప్రియులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగించేస్తుంటారు.

1 / 5
చికెన్ ఆరోగ్యానికి అంత హానికరం కాదు. చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. చికెన్ తినడం ద్వారా శరీరంలో శక్తి పెరుగుతుంది. చికెన్ తింటే నష్టమేమీ ఉండదు. కానీ ఇష్టమని అదేపనిగా ప్రతిరోజూ తిరటం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

2 / 5
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు కొవ్వు కూడా ఉంటుంది. చికెన్‌లో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. రోజూ చికెన్ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

3 / 5
అంతేకాకుండా చికెన్‌ కోసం ప్రత్యేకంగా పెంచే కోళ్లకు పౌల్ట్రీలలో యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తారు. ఈ యాంటీబయాటిక్స్ మానవ శరీరానికి హానికరం. అందుకే బ్రాయిలర్‌కు బదులు నాటు కోడి తినాలని వైద్యులు సూచిస్తుంటారు.

4 / 5
యూరిక్ యాసిడ్ సమస్యలున్న వారు చికెన్ తినడం మానుకోవాలి. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. గౌట్ నొప్పి కూడా పెరగవచ్చు. బ్రాయిలర్ చికెన్‌లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా అతిగా శరీరంలోకి ప్రవేశిస్తే, అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి రోజూ చికెన్ తినడం మంచిది కాదు. చికెన్‌కు బదులుగా నాటు కోడి చికెన్ తినడం మంచిది. ఒకవేళ రోజూ చికెన్ తినాల్సి వస్తే 100 గ్రాములకు మించి తినకుండా జాగ్రత్త పడాలి. ఇందులో నూనె, మసాలాలు కొంచెం తక్కువగా వాడడం మంచిది.

5 / 5
Follow us