- Telugu News Photo Gallery Cinema photos Amitabh Bachchan's Grand Daughter Navya Naveli Nanda Stunning Photos Goes Viral
Navya Naveli Nanda: వామ్మో.. ఏం పిల్ల రా బాబు.. హీరోయిన్లకు ధీటుగా అమితాబ్ మనవరాలు..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టి్స్తోంది బిగ్ బీ మనవరాలు నవ్వ నవేలి నందా. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
Updated on: Jul 07, 2024 | 8:02 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టి్స్తోంది బిగ్ బీ మనవరాలు నవ్వ నవేలి నందా.

ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న గ్రాండ్ గా వీరిద్దరి పెళ్లి జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది నవ్వ నవేళి నందా.

యువ వ్యాపారవేత్త అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన మోడ్రన్ లెహాంగాలో సాంప్రదాయ మోడ్రన్ లుక్ లో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. మిరుమిట్లు గొలిపే డైమండ్ పచ్చలతో పొదిగిన నెక్లెస్ ధరించి మరింత అందంగా మెరిసిపోయింది.

నవ్య నవేలి నంద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నవ్య సినీ పరిశ్రమలోకి కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. బిజినెస్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 26 ఏళ్లకే 1000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తుంది.

మహిళల కోసం సమ్యక్ చక్రవర్తి ఫౌండేషన్ సహకారంతో స్మార్ట్ ఫెలోషిప్ సంస్థను కొత్తగా ప్రారంభించింది. ఇందులో మహిళలకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్పిస్తారు. ఇందులో కనీసం 1000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు.




