ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభించేవి అరటి పండ్లు. పైగా ధర కూడా తక్కువ. అందుకే అన్ని వయసుల వారు వీటిని తింటుంటారు. అయితే అరటి పండ్లను చాలా మంది పూర్తిగా పండ్లుగా మారకుండా కాస్త దోరగా ఉన్నప్పుడే తింటారు
TV9 Telugu
కానీ దోరగా ఉన్న పండ్ల కన్నా బాగా పండిన అరటి పండ్లను తింటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. బాగా పండిన అరటి పండ్లను తినడం వల్ల సాధారణ పండ్లలో కన్నా రెట్టింపు మొత్తంలో పోషకాలు లభిస్తాయి
TV9 Telugu
ఇలాంటి పండ్లను తింటే అనేక వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు. సాధారణ అరటికాయల కన్నా బాగా పండిన అరటి పండ్లను తింటే తేలిగ్గా జీర్ణమవుతాయి
TV9 Telugu
చిన్నారులు, వృద్ధులు సైతం ఇలాంటి పండ్లను సులభంగా జీర్ణం చేసుకోగలుగుతారు. దీంతో పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. బాగా పండిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
TV9 Telugu
బాగా పండిన అరటి పండ్లపై నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఇలాంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి
TV9 Telugu
వీటిల్లో విటమిన్ సి, డోపమైన్ వంటివి కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల బాగా పండిన పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి
TV9 Telugu
ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో దోహదం చేస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులు రాకుండా ఉంటాయి
TV9 Telugu
బాగా పండిన అరటి పండ్లలో పొటాషియం సైతం అధికంగా ఉంటుంది. అలాగే మెగ్నిషియం స్థాయిలు దండిగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి