Hyderabad: బస్సులో పోలీసుల క్యాజువల్‌ తనిఖీలు.. ఖాకీలను చూసి ఆ ఇద్దరు తత్తరపాడు! చెక్‌ చేయగా..

హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 982.25 గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని తరలిస్తుండగా..

Hyderabad: బస్సులో పోలీసుల క్యాజువల్‌ తనిఖీలు.. ఖాకీలను చూసి ఆ ఇద్దరు తత్తరపాడు! చెక్‌ చేయగా..
Gold Smuggling
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:47 AM

హైదరాబాద్‌, జూలై 8: హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 982.25 గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సుమారు నాలుగు కిలోల వరకు పట్టుబడ్డ బంగారం ఉంటుందని డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు పేర్కొన్నారు.

అక్రమంగా బంగారాన్ని పలువురు వ్యక్తులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందిందని, ఆ మేరకు అధికారుల సోదాలు జరిపి.. వలవేసి చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నామని, వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు మీడయాకు తెలిపారు. జులై 6వ తేదీన ఇద్దరు వ్యక్తులు నడుముకు ధరించే పట్టీలో బంగారాన్ని తీసుకొస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇద్దరు వ్యక్తులపై కస్టమ్స్‌ చట్టం కింద అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

24 గంటల్లో నలుగురు రైతుల ఆత్మహత్య

కాలం కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తెలంగాణలో రైతులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గడచిన 24 గంటల్లోనే రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఒకరు భూసమస్య పరిష్కారం కావడం లేదనే మనస్తాపంతో ప్రాణాలు విడవగా.. అస్సుల బాధ తాళలేక లక్ష్మయ్య అనే మరో రైతు పురుగుల మందు తాగి శనివారం రాత్రి మృతి చెందాడు. ఆత్మహత్యకు యత్నించిన మరో ఇద్దరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, జనగామ, ములుగు జిల్లాల్లో జరిగిన వేరువేరు సంఘటనలో ఈ దారుణాలు చోట చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.