Telangana: పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Telangana: పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..
Brs Bjp Congress
Follow us

|

Updated on: Jul 08, 2024 | 8:00 AM

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్‌ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుల వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే.. అధికార కాంగ్రెస్‌ తీరుపై బీఆర్ఎస్‌ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ ఒకవైపు రాజ్యాంగం విలువలు గురించి చెప్తూ.. మరోవైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డే.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి.. కాంగ్రెస్‌ కండువాలు కప్పుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా.. ద్వంద్వ విధానాలకు ఎంపీ రాహుల్‌ గుడ్‌ బై చెప్పి.. పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్‌ చేశారు.

ఇక.. ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్‌ కామెంట్స్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది. విలువలు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత బీఆర్ఎస్‌ హయాంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు నిరంజన్‌రెడ్డి ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ నీతులు చెప్తుంటే.. వినే స్థితిలో కాంగ్రెస్‌ లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మొత్తంగా.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్‌ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడంతో అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే.. ఫిరాయింపుల విషయంలో రాహుల్‌ మాటలను గుర్తు చేస్తూ.. టీ.కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అటు.. బీఆర్ఎస్‌పై కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగుతుండడంతో పొలిటికల్‌గా హీట్‌ పెరుగుతోంది.

అదే క్రమంలో బీజేపీ కూడా చేరికలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనైతికంగా కాకుండా గెలిచిన అభ్యర్థులు రాజీనామా చేసి పార్టీలో చేరాలంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. తెలంగాణలో ఇప్పటికే మంచి ఓటు బ్యాంకు సాధించి జోరు మీద ఉన్న కమలం పార్టీ మంచి నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగానే నేరుగా ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకోకుండా రాజీనామా చేసిన తరువాత తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఏ పార్టీలో చేరబోతున్నారన్న దానిపై జోరుగా చర్చ జరుగుతున్న తరుణంలో ఫిరాయింపుల పర్వం జోరుగా నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక గూగుల్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్.. కొత్త అప్‌డేట్‌
ఇక గూగుల్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్.. కొత్త అప్‌డేట్‌
షుగర్ వ్యాధికి ఛూమంత్రం.. ఉదయాన్నే పరగడుపున తింటే..
షుగర్ వ్యాధికి ఛూమంత్రం.. ఉదయాన్నే పరగడుపున తింటే..
కళ్యాణ్ రామ్ కూతురు, కొడుకును చూశారా.. మరో నందమూరి వారసుడి ఎంట్రీ
కళ్యాణ్ రామ్ కూతురు, కొడుకును చూశారా.. మరో నందమూరి వారసుడి ఎంట్రీ
విమానం టైర్లు బరువు, వేగాన్ని ఎలా తట్టుకుంటాయి? కారణం ఇదే..!
విమానం టైర్లు బరువు, వేగాన్ని ఎలా తట్టుకుంటాయి? కారణం ఇదే..!
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..