AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP’s Alcohol Party: ఎంపీ విజయోత్సవ విందులో బహిరంగంగా మద్యం పంపిణీ.. ఎగబడ్డ మందుబాబులు! వీడియో

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బీజేపీ నేత, మాజీ మంత్రి కే సుధాకర్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. తన గెలుపు సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు పార్టీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. విందులో భాగంగా బాహాటంగా మద్యం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంపీ ఇచ్చిన పార్టీలో మద్యం తీసుకునేందుకు మందుబాబులు క్యూలో..

MP's Alcohol Party: ఎంపీ విజయోత్సవ విందులో బహిరంగంగా మద్యం పంపిణీ.. ఎగబడ్డ మందుబాబులు! వీడియో
Karnataka MP Alcohol Party
Srilakshmi C
|

Updated on: Jul 09, 2024 | 8:39 AM

Share

చిక్కబళ్లాపూర్, జులై 9: కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన బీజేపీ నేత, మాజీ మంత్రి కే సుధాకర్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. తన గెలుపు సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకునేందుకు పార్టీ కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. విందులో భాగంగా బాహాటంగా మద్యం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంపీ ఇచ్చిన పార్టీలో మద్యం తీసుకునేందుకు మందుబాబులు క్యూలో నిలుచోగా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం విడ్డూరంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని పలువురు ఆరోపణలు చేశారు.

ఈ ఘటనపై బెంగళూర్‌ రూరల్ ఎస్పీ సీకే బాబా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్‌ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసిందని, పైగా ఎక్సైజ్‌ శాఖ కూడా ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ విషయంలో పోలీస్‌ శాఖ తప్పిదం ఏమీ లేదని, అనుమతి ఇచ్చే బాధ్యత ఎక్సైజ్‌ శాఖదేనని స్పష్టం చేశారు. చిక్కబళ్లాపూర్‌ కార్యకర్తలకు థ్యాంక్స్ గివింగ్‌ పార్టీ నిర్వహించాలని భావించారు. అక్కడ ఇచ్చిన విందులో మద్యం పంపిణీ కూడా భాగమేనని అంగీకరించారు. ఈ కార్యక్రమానికి అనుమతి తీసుకోవాలని సుధాకర్‌ నాకు చెప్పారు. నేను 500-5,000 మందికి మద్యం పంపిణీ చేయడానికి ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకొన్నానని నేలమంగళ తాలూకా బీజేపీ అధ్యక్షుడు జగదీష్ చౌదరి వివరణ ఇచ్చారు. కాగా ఈ పార్టీకి బీజేపీ కార్యకర్తలతో సహా దాదాపు 4 వేల మందికి పైగా విందుకు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యవహారంపై బీజేపీ నేతల తీరుపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మండిపడ్డారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనంటూ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు డెంగ్యూతో బాధపడుతుండే బీజేపీ నాయకులు మద్యం పంపిణీలో బిజీగా ఉన్నారంటూ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. నేను మంగళూరులో పర్యటించినప్పుడు స్విమ్మింగ్‌ చేయడాన్ని ప్రశ్నించిన బీజేపీ నేతలు ఇప్పుడెక్కడున్నారు? ఇదేనా మీ సంస్కృతి? అంటూ మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.