AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘ఎంత పని చేశావ్‌ తల్లీ!’ ఉరేసుకుని యువతి ఆత్మహత్య.. విలవిలలాడిన పెంచిన బంధం

పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటకు సంతానం కలగ లేదు. ఎందరో డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్నారు. ఎన్నో గుడుల కెళ్లి కనిపించిన దేవుడిని మెక్కారు. అయినా వారి ఇంట సంతానం కలగలేదు. దీంతో ఓ పాపను దత్తత తీసుకుని, అల్లారుముద్దుగా పెంచారు. కష్టపడి చదివించి, ప్రయోజకురాలిని చేయాలనుకున్నారు. బాగా చదువుకుని ఆ పాప.. మంచి ఉద్యోగం సాధించి, తమను ఆదుకుంటుందని..

Andhra Pradesh: 'ఎంత పని చేశావ్‌ తల్లీ!' ఉరేసుకుని యువతి ఆత్మహత్య.. విలవిలలాడిన పెంచిన బంధం
Young Woman Committed Suicide
Srilakshmi C
|

Updated on: Jul 08, 2024 | 10:37 AM

Share

కొత్తవలస, జులై 8: పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జంటకు సంతానం కలగ లేదు. ఎందరో డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్నారు. ఎన్నో గుడుల కెళ్లి కనిపించిన దేవుడిని మెక్కారు. అయినా వారి ఇంట సంతానం కలగలేదు. దీంతో ఓ పాపను దత్తత తీసుకుని, అల్లారుముద్దుగా పెంచారు. కష్టపడి చదివించి, ప్రయోజకురాలిని చేయాలనుకున్నారు. బాగా చదువుకుని ఆ పాప.. మంచి ఉద్యోగం సాధించి, తమను ఆదుకుంటుందని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి కలలను నిర్ధాక్షిణ్యంగా చిదిమేస్తూ వారు పెంచుకున్న అమ్మాయి, వారిని వదిలి అనంతలోకానికి వెళ్లిపోయింది. ఎం కష్టం వచ్చిందో.. ఏమో.. ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని కొత్తవలస మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

కొత్తవలస మండలం సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు సంతానం లేదు. దీంతో వారు కొన్నేళ్ల కిందట సంధ్య (19) అనే అమ్మాయిని దత్తత తీసుకుని, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పెరిగి పెద్దైన సంధ్య కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నికల్‌ కూడా పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికల్లో చిత్తూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం సాధించింది. తమ కలల పంట కొలువు సాధించి ప్రయోజకురాలు అయ్యిందని పెంచినోళ్లు మురిసిపోయారు. కానీ గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా సంథ్య ఇంటివద్దే ఉంటోంది.

అయితే శ్రీను, పద్మ.. దంపతులిద్దరూ ఆదివారం పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో వంటరిగా ఉన్న సంథ్యకు భోజనం ఇచ్చేందుకు పక్కింటి మహిళ వెళ్లి తలుపు కొట్టగా.. సంధ్య ఎంతకు తలుపులు తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూసేసరికి సంధ్య ఇంటిలోని పంకాకు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కేకలు వేస్తూ.. ఇరుగుపొరుగును పిలిచింది. చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకొని తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే సంథ్య ప్రాణాలు వదిలింది. వెంటనే వారు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పరుగుపరుగున ఇంటికి వచ్చిన శ్రీను, పద్మ.. కుమార్తె మరణం తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు కూడా విషయం తెలపడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎస్‌ కోట ప్రాంతీయాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సంథ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.