బెజవాడలో బెంబేలెత్తిస్తున్న ముఠా.. లక్షలు ఆశచూపి కిడ్నీ కొట్టేశారు..!

పేదరికం వెంటాడింది. అప్పుల మీద అప్పులు పెరిగిపోయాయి. లోన్ యాప్స్ వేధింపులు పెచ్చుమీరిపోయాయి. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఇంతలో ఏవరో ఇచ్చిన సలహా మేరకు అవయవం అమ్మేందుకు సిద్దం అయ్యాడు. ఫేస్ బుక్ లో పరిచయంతో ఎట్టకేలకు ముందడగు వేశాడు. అవయవం అయితే తీసుకున్నారు..కానీ, ఇస్తానన్న మొత్తం ఇవ్వలేదు. దీంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బెజవాడలో బెంబేలెత్తిస్తున్న ముఠా.. లక్షలు ఆశచూపి కిడ్నీ కొట్టేశారు..!
Kidney Scam
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 08, 2024 | 8:38 PM

అతని పేరు గార్లపాటి మధుబాబు… వయస్సు 31… పెళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు. గుంటూరు కేవిపి కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడు. కరోనా సమయంలో ఏం చేసిన కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు. అయితే ఈక్రమంలోనే పెద్ద ఎత్తున చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సతమతం అయ్యాడు. అప్పటి నుండి రెండేళ్ల పాటు అప్పులు తీర్చటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత ఏడాది చివర్లో ఒకరిచ్చిన సలహాతో కిడ్నీ అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సమయంలోనే బాషా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఫేస్ బుక్ లో ఉన్న యాప్స్ ద్వారా కిడ్ని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా కిడ్ని అమ్ముకున్నట్లు చెప్పాడు. దీంతో మధుబాబు ఫేస్ బుక్ లోకి యాప్స్ ద్వారా కిడ్ని అమ్మేందుకు సిద్దం అయ్యాడు. అప్పుడే బాషా ద్వారా వెంకట్ అనే మరొక వ్యక్తి పరిచయం అయ్యాడు. తనకు కావాల్సిన వారికి కిడ్నీ ఇస్తే ముప్పై లక్షలు ఇస్తానని చెప్పాడు. దీంతో మధుబాబు కిడ్ని ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. గత నవంబర్ నుండి మధుబాబు పేరు మీదన్న రికార్డులన్నింటిని వెంకట్ మార్చేశాడు. అప్పటి నుండి నెలవారి ఖర్చుల కింద కొత్త మొత్తాన్ని ఇచ్చారు. గత నెల పదిహేనో తేదిన విజయవాడలోని విజయా సూపర్ స్పెషాటిలీ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ చేశారు.

అయితే అప్పటి వరకూ అతని మొత్తం లక్షా పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కొద్దీగా కొలుకున్న తర్వాత మధుబాబు మిగిలిన డబ్బులు ఇవ్వాలంటూ వెంకట్ అడగటం మొదలు పెట్టాడు. అయితే రక్త సంబంధీకుడుగానే కిడ్ని ఇచ్చావని నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ వెంకట్ ఎదురు తిరిగాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న మధుబాబు ఈ రోజు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. తన కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకోవడమే కాకుండా ఇంకొకరు ఈ విధంగా మోసపోకుండా చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..