- Telugu News Photo Gallery How to use bhringaraja oil for hair growth and white hair to black hair naturally Telugu Lifestyle News
Aloe Vera For Hairs: కలబందలో ఈ ఆకును కలిపి రాస్తే మీ జుట్టు ఆగకుండా నల్లగా పెరుగుతూనే ఉంటుంది..!
సరైన పోషకాహారం లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న కాలుష్యం... ఇవన్నీ జుట్టు రాలడం, ఇతర జుట్టు సమస్యలకు కారణం కావచ్చు. ఇదిలా ఉంటే చాలా మంది తమ జుట్టు సమస్యలను నియంత్రించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆధునిక రసాయనాలతో సహా వైద్యులు ఇచ్చే మందులు వాడుతున్నా జుట్టు సమస్యలకు ఉపశమనం లభించడం లేదా..? కానీ, ఒక ఆకు మీ జుట్టును సంరక్షిస్తుంది అంటే నమ్మాల్సిందే..! ఆ ఆకు ఏది? దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 06, 2024 | 1:11 PM

ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. అలాగే చాలా మంది చిన్న వయసులోనే గ్రే హెయిర్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. హోం రెమెడీస్ ఉపయోగించి జుట్టు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

భృంగరాజ్.. ఈ మొక్క పేరు వినే ఉంటారు. ఈ మొక్క ఆకులు, కాండం మీ జుట్టు సమస్యలకు సంజీవనిగా పనిచేస్తుంది. దీంతో మీ జుట్టు మందంగా, ముదురు రంగులో పెరగడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల రసాన్ని కొబ్బరినూనెలో వేసి మరిగించి జుట్టుకు క్రమం తప్పకుండా రాసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బృంగరాజ ఆకుల పొడిని కలబందతో కలిపి తలకు పట్టిస్తూ ఉంటే మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతూ ఉంటుంది. ఇది జుట్టు రక్షణలో సహాయపడుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, ఇది కొత్త జుట్టు పెరగడానికి, జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

భృంగరాజ్‌తో పాటు.. అలోవెరా జెల్ కలిపి అప్లై చేస్తే జుట్టుకు మరింత మేలు చేస్తుంది. అలోవెరా జెల్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి ఉన్నాయి. జుట్టుకు సమృద్ధిగా పోషణను అందిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టును హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. అలోవెరా జెల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టును అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది.

మాస్క్ ఎలా తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో అలోవెరా జెల్, 1 టీస్పూన్ బృంగరాజ్ పౌడర్ కలపాలి. ఈ రెండింటినీ జుట్టుకు పట్టించాలి. అప్పుడు 1 నుండి 2 గంటల పాటు వదిలివేయండి. తర్వాత జుట్టును షాంపూతో కడగాలి. వారానికి కనీసం 1 నుండి 2 సార్లు ఇలా చేయడం మంచిది.





























