Nani:ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క అంటున్న నాని.. స్పీడు పెంచుతున్న నేచురల్ స్టార్
సీనియర్ల చేతుల్లో ఒకటికి నాలుగు సినిమాలున్నప్పుడు, మనం నిదానంగా నడుస్తామంటే ఎలా? అని ఆలోచిస్తున్నారు యంగ్ హీరోలు. వారందరిలోనూ ఓ అడుగు ముందుకేశారు నేచురల్ స్టార్. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుందట ఆయన వైఖరిని గమనిస్తే... ఇంతకీ ఏంటదీ? చూసేద్దాం రండి.... స్పీడు పెంచాలని ఫిక్సయ్యారు నాని. అందుకే ఒక సినిమా సెట్స్ మీదున్నప్పుడే, ఇంకో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Ravi Kiran
Updated on: Jul 06, 2024 | 9:41 PM

సీనియర్ల చేతుల్లో ఒకటికి నాలుగు సినిమాలున్నప్పుడు, మనం నిదానంగా నడుస్తామంటే ఎలా? అని ఆలోచిస్తున్నారు యంగ్ హీరోలు. వారందరిలోనూ ఓ అడుగు ముందుకేశారు నేచురల్ స్టార్. ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇకపై ఇంకో లెక్క అన్నట్టుందట ఆయన వైఖరిని గమనిస్తే... ఇంతకీ ఏంటదీ? చూసేద్దాం రండి....

స్పీడు పెంచాలని ఫిక్సయ్యారు నాని. అందుకే ఒక సినిమా సెట్స్ మీదున్నప్పుడే, ఇంకో సినిమాను లైన్లో పెట్టేస్తున్నారు. సరిపోదా శనివారం సెట్స్ మీద ఉన్నప్పుడే దసరా కెప్టెన్‌తో స్క్రిప్టు రెడీ చేయించారు నాని.

దసరా కాంబో రిపీట్ అవుతుందని అనగానే జనాల ఎక్స్ పెక్టేషన్స్ వేరే లెవల్లో ఉంటుంది. దాన్ని రీచ్ అయ్యేలాగా స్క్రిప్టు రెడీ అయిందట. ప్యాన్ ఇండియా రేంజ్ రీచ్ ఖాయం అంటున్నారు కథ గురించి తెలిసిన వారు.

ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట నేచురల్ స్టార్. శైలేష్ కొలను ఇటీవల హిట్ నెక్స్ట్ చాప్టర్ లైన్‌ని చెప్పారట నానికి.

కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చిందట. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఐపీయస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు నాని.





























