- Telugu News Photo Gallery Cinema photos Bollywood Celebrities Attend Anant Ambani And Radhika Merchant Sangeet, Photos Here
Anant Ambani Wedding: గ్రాండ్‌గా అనంత్ అంబానీ- రాధికల సంగీత్.. సందడి చేసిన అందాల తారలు.. ఫొటోస్ చూశారా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Jul 06, 2024 | 8:53 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహానికి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి ముందు జరిగిన సంగీత్ వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. సీనియర నటి కాజల్ మొదలుకుని నుంచి ఆలియా భట్ వరకు అందరూ కలర ఫుల్ డ్రెస్సుల్లో కనిపించారు.

అనంత్ అంబానీ- రాధికల సంగీత్ వేడుకలకు హాజరైన వారిలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, సారా అలీఖాన్, అనన్యా పాండే తదితరులు ఉన్నారు

ఇక రితేశ్ దేశ్ ముఖ్- జెనీలియా, రకుల్- జాకీ భగ్నానీ, సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ, రణ్ బీర్ కపూర- అలియాలు సతీ సమేతంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక టాలీవుడ్ నుంచి కాజల్ అగర్వాల్, భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఈ సంగీత్ పార్టీకి వచ్చింది. అలాగే చాలా రోజుల తర్వాత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య, బాలీవుడ్ నటి అతియా శెట్టి ఓ వేడుకలో కనిపించారు.

సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, ఆదిత్య రాయ్ కపూర్ తదితర సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు క్రికెటర్లు ఈ సంగీత్ వేడుకలో సందడి చేశారు.





























