- Telugu News Photo Gallery Cinema photos Hero Suhas film journey from short film to Industry minimum guarantee hero Telugu Heroes Photos
Suhas: షార్ట్ ఫిలిం నుండి సినీ నిర్మాతల మినిమమ్ గ్యారెంటీ హీరోగా సుహాస్ జర్నీ సూపర్బ్..
హీరో అవ్వాలంటే అందంగా ఉండాలి.. ఆరడుగులు ఉండాలి.. అనే కొలమానాలతో పనిలేదు. టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించారు. తాజాగా మరో నటుడు కూడా ఇదే చేసి చూపిస్తున్నారు. నిజానికి అతన్ని చూసినపుడు ఇతడేం హీరో.. డబ్బులు పెట్టుకుని ఈయన్ని చూడ్డానికి వస్తారా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడతమే మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయారు.
Updated on: Jul 06, 2024 | 5:26 PM

హీరో అవ్వాలంటే అందంగా ఉండాలి.. ఆరడుగులు ఉండాలి.. అనే కొలమానాలతో పనిలేదు. టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించారు. తాజాగా మరో నటుడు కూడా ఇదే చేసి చూపిస్తున్నారు. నిజానికి అతన్ని చూసినపుడు ఇతడేం హీరో..

డబ్బులు పెట్టుకుని ఈయన్ని చూడ్డానికి వస్తారా అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడతమే మినిమమ్ గ్యారెంటీ హీరో అయిపోయారు. యూ ట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే స్థాయి నుంచి ఇండస్ట్రీలో నిర్మాతలు నమ్మే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదగడం అంటే చిన్న విషయం కాదు.!

దాన్ని చేసి చూపిస్తున్నారు సుహాస్. కమెడియన్ నుంచి కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి.. ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నారీయన. ఈ మధ్యే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్‌తో ఓకే అనిపించిన సుహాస్.. తాజాగా మరో సినిమాతో వస్తున్నారు సుహాస్.

మామూలుగా కమెడియన్ ఎవరైనా హీరోగా మారితే.. అతన్నుంచి కామెడీ సినిమానే ఊహిస్తాం. కానీ సుహాస్ అలా కాదు.. కలర్ ఫోటో నుంచే విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. కామెడీ కంటే ఎమోషన్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కథలు ఎంచుకుంటున్నారు.

ఈ మధ్యే ఓ భామ అయ్యో రామా అనే కలర్ ఫుల్ లవ్ స్టోరీకి సైన్ చేసారు సుహాస్. రామ్ గోదాల ఈ సినిమాకు దర్శకుడు. V ఆర్ట్స్, చిత్రలహరి టాకీస్ బ్యానర్స్‌పై హరీష్ నల్లా, ప్రదీప్ సంయుక్తంగా సుహాస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

జ్యో సినిమా ఫేమ్ మాళవిక మనోజ్ ఇందులో హీరోయిన్. ఈ ఏడాది ఇప్పటికే అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్, ప్రసన్న వదనం, శ్రీరంగనీతులు సినిమాలతో వచ్చారు సుహాస్.

తాజాగా సుహాస్ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా వస్తుంది. దాని పేరు జనక అయితే గనక..! పిల్లల్ని కనాలంటే ముందు లైఫ్‌లో బాగా సెటిల్ అవ్వాలి..

వాళ్లకు మంచి లైఫ్ ఇవ్వాలని నమ్మే ఓ మిడిల్ క్లాస్ భర్త కథ ఇది. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఈ చిత్రం వస్తుంది. త్వరలోనే సినిమా విడుదల కానుంది. మొత్తానికి చూడాలిక.. సుహాస్ జర్నీ ఇంకెంత దూరం వెళ్లనుందో..?




