AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..!

Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి.

గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..!
Lunar Eclipse Laxmi
Rajashekher G
|

Updated on: Mar 02, 2026 | 6:52 AM

Share

సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. లవంగాలు అత్యంత శక్తివంతమైనవిగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కేవలం రెండు లవంగాలను ఉపయోగించి చేపట్టే కొన్ని కర్మలు ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి, ధనాన్ని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, రుణ బాధల నుండి విముక్తి కల్పించి, కష్టాలను తొలగిస్తాయి. సోమవారం ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి, శివపార్వతుల పటాన్ని అలంకరించి దీపారాధన చేయాలి. తమలపాకు, మారేడు దళంపై ప్రమిద పెట్టి, రెండు వత్తులతో దీపం వెలిగించి, ఆ వెలుగుతున్న దీపంలో ఒక పువ్వు ఉన్న లవంగాన్ని వేయాలి. మీ సమస్యలను లవంగానికి చెప్పుకుని “ఓం నమః శివాయ” అని మూడు సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, ఆర్థికంగా కలిసివస్తుందని నమ్మకం. ఈ చిన్న పరిహారం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఆర్థిక కష్టాలు, రుణ బాధల నివారణకు:

సోమవారం ఉదయాన్నే నిద్రలేచి, శుచిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంట్లోని శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసి, పుష్పాలతో అలంకరించాలి. దీపారాధన కోసం తమలపాకును తీసుకొని, దానిపై మారేడు దళాన్ని, దానిపై ప్రమిదను ఉంచి, రెండు ఒత్తులతో దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఈ దీపంలో ఒక పువ్వు ఉన్న లవంగాన్ని వేయాలి. లవంగాన్ని చేతిలో పట్టుకొని మీ కష్టాలు, ఆర్థిక సమస్యలను మనసులో తలచుకుని, ఆ లవంగాన్ని దీపంలో వేసి, నమస్కరించి “ఓం నమః శివాయ” అని మూడు సార్లు జపించాలి. ఈ పరిహారం ద్వారా కష్టాలు తీరి, ఆర్థికంగా కలిసివస్తుందని, రుణబాధలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేయాలి. ఇదే విధంగా యాలకులను లేదా రూపాయి బిళ్లను దీపంలో వేసి దీపారాధన చేయడం వల్ల కూడా ధన ప్రాప్తి కలుగుతుంది. రూపాయి బిళ్లను దీపారాధన తర్వాత పేదవారికి దానం చేయాలి.

చెడు కలల నివారణకు:

కొంతమందికి చెడు కలలు వచ్చి నిద్రలేమి, భయం వంటివి కలుగుతాయి. అలాంటి వారు ఒక గాజు గ్లాసులో సగభాగం నీటిని తీసుకోవాలి. రెండు పువ్వు ఉన్న లవంగాలను చేతిలో పట్టుకుని, వాటిని మూడు సార్లు తల చుట్టూ తిప్పి, చెడు కలలు రాకూడదని సంకల్పించుకుని ఆ నీటిలో వేయాలి. ఈ గాజు గ్లాసును మీరు పడుకునే మంచం కింద (లేదా కింద పడుకుంటే తల పైభాగంలో) రాత్రంతా ఉంచాలి. గ్లాసుపై మూతలు పెట్టకూడదు. నీరు కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఉదయం నిద్రలేవగానే లవంగాలతో సహా ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో బయట పోయాలి. ఇలా కనీసం రెండు లేదా మూడు సోమవారాలు చేయడం వల్ల చెడు కలల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. నీటికి, లవంగాలకు ఉండే అతీత శక్తి చెడును తొలగిస్తుందని నమ్మకం.

వ్యాపార వృద్ధి, ముఖ్య కార్యాల విజయానికి:

ధనం వృద్ధి చెందడానికి, వ్యాపారంలో లాభాలు రావడానికి, రెండు పువ్వు ఉన్న లవంగాలను శివపార్వతుల పటం ముందు ఉంచి పూజించిన తర్వాత, వాటిని తీసి మీ పర్సులో లేదా వ్యాపార గల్లా పెట్టెలో పెట్టుకోవచ్చు. ఈ లవంగాలను నెల రోజులు, పదిహేను రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ఉంచవచ్చు. ఆ తర్వాత మార్చాలి. పువ్వు ఉన్న లవంగాలకే శక్తి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లేటప్పుడు, సందేహాలు లేకుండా పని జరగాలని కోరుకుంటూ ఒక పువ్వు ఉన్న లవంగాన్ని నోట్లో వేసుకొని వెళ్ళాలి. పని పూర్తయ్యే వరకు దానిని చప్పరించాలి. తులసి మొక్కకు నమస్కరించి వెళితే కార్యం విజయవంతమవుతుందని నమ్మకం. మునులు, ఋషులు కూడా ఈ పరిహారాన్ని ఆచరించేవారని చెబుతారు. ఇంటర్వ్యూలు, కోర్టు పనులు లేదా మరేదైనా ముఖ్యమైన కార్యక్రమాల కోసం వెళ్లేటప్పుడు ఇది చాలా సహాయపడుతుంది.

సోమవారం శివ పూజ:

సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివాలయానికి వెళ్లి ఒక చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసి, నంది కొమ్ముల మధ్య నుండి పరమశివుడిని దర్శించుకొని మీ కోరికలను నంది చెవిలో చెప్పడం ద్వారా నెరవేరతాయని నమ్మకం. ఇంట్లో శివుడిని పూజించేటప్పుడు “ఓం నమః శివాయ” మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నీటిలో కొద్దిగా పసుపు లేదా పంచదార కలిపి శివుడికి అభిషేకం చేయడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోయి, ధన ప్రాప్తి కలుగుతుంది.

ఈ లవంగాల పరిహారాలు, శివ పూజలు శ్రద్ధతో ఆచరించడం ద్వారా జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us