Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా.. ? కారణం ఇదేనట..!

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకరణ, సేవల కోసం ప్రతిరోజూ టన్నుల కొద్దీ పుష్పాలను ఉపయోగిస్తారు. అయితే, ఆ శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తులు పూలు ముట్టకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు పొరపాటున పువ్వులు పెట్టుకుని వెళ్ళినా చెక్ పోస్ట్ దగ్గర, క్యూలైన్లలోనే ఆ పూలను తీసివేయించి, ఆ తరువాత స్వామి వారి దర్శనానికి భక్తులను పంపుతారు.అయితే ఈ విధంగా స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు ఎందుకు పెట్టుకోకూడదు..? దాని వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా.?

తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా.. ? కారణం ఇదేనట..!
Tirupati
Jyothi Gadda
|

Updated on: Jul 08, 2024 | 3:13 PM

Share

దేవాలయాలకు వెళ్లేందుకు భక్తులు సాధారణంగా సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు. నుదుటిపై కుంకుమ, తలలో పూలు పెట్టుకుంటారు.. కానీ శ్రీవేంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టకూడదు అనే నియమం ఉందని మీకు తెలుసా..? భువైకుంట తిరుమలకు ఏటా కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. కేవలం భారతదేశం నుంచి మాత్రమే దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. గంటలు, రోజుల తరబడి క్యూలో నిలబడి గోవిందా అంటూ.. లక్ష్మి వల్లభను కొలుస్తుంటారు.

తిరుమలలో ప్రతిరోజూ శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. అందుకే శ్రీ మహా విష్ణువును అలంకార ప్రియుడు అని కూడా అంటారు. శ్రీహరి పుష్ప ప్రియుడని కూడా అంటారు.

పురాణాలలో తిరుమలను పూల మంటపం అంటారు. తిరుమల పూల మంటపం కావడంతో శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడంతో స్వామివారిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వందలాది అలంకారాల్లో గోవిందుడు భక్తులను పులకింపజేస్తాడు. తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీ మన్న నారాయణునికి అంకితమని ప్రజలు, భక్తులు విశ్వసిస్తారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఈ కారణం చేతనే స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..