Success Story: లక్షల రూపాయల ఉద్యోగాన్ని పక్కనపెట్టి కూరగాయలు పండిస్తున్న ఐఐటీ ఇంజనీర్.. ఫుల్లు గిరాకీ?!
అయితే సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అనారోగ్యంతో ఉన్నవారికి నామమాత్రపు ధరకే కూరగాయలు ఇస్తున్నాడు. సేంద్రియ సాగులో ప్రధానంగా టమోటో, బీర, వంకాయ, బెండ, కర్బుజా, క్యాబేజ్, క్యాప్సికమ్ తో పాటు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రకృతి సాగును ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో అప్పలరాజును చూసిన ఇతర రైతులు కూడా ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రకృతి సాగులో పలు రకాల అరుదైన కూరగాయలు కూడా పండిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా పెదపాడు తంగివానిపేటకు చెందిన సిమ్మ అప్పలరాజు కాన్పూర్ ఐఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత క్యాంపస్ లో ఉండగానే ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు. కొన్నాళ్ళు ఉద్యోగం సజావుగా చేసిన అప్పలరాజుకు తాను చేస్తున్న ఉద్యోగం అంత సంతృప్తిని ఇవ్వలేదు. ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే సిద్ధాంతాలతో ముందుకు సాగే అప్పలరాజు అన్నా హజారే ప్రోత్సహించే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పెట్రోల్ బంక్ సమీపంలో 26 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అలా కౌలుకు తీసుకున్న భూమిలో సేంద్రీయ వ్యవసాయంతో కూరగాయల సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. సాగు చేసే క్రమంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి పొందడం ఎలాగో మెలకువలు నేర్చుకున్నాడు. అనంతరం రసాయన ఎరువులు, కెమికల్స్ లేకుండా సేంద్రీయ పద్ధతిలో పలు రకాల కూరగాయల సాగును ప్రారంభించారు.
సేంద్రియ వ్యవసాయం కావడంతో ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. దీంతో అప్పలరాజు పండించిన కూరగాయలకు కూడా మంచి గిరాకీ వచ్చింది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న కూరగాయలను తన తోట నుండే నేరుగా వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే సంపాదించిన సొమ్ములో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అనారోగ్యంతో ఉన్నవారికి నామమాత్రపు ధరకే కూరగాయలు ఇస్తున్నాడు. సేంద్రియ సాగులో ప్రధానంగా టమోటో, బీర, వంకాయ, బెండ, కర్బుజా, క్యాబేజ్, క్యాప్సికమ్ తో పాటు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రకృతి సాగును ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో అప్పలరాజును చూసిన ఇతర రైతులు కూడా ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రకృతి సాగులో పలు రకాల అరుదైన కూరగాయలు కూడా పండిస్తున్నారు.
పండిన పంటను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల సుమారు 300 టన్నుల వరకు కూరగాయలను ఎగుమతి చేస్తున్నారు. అధిక శాతం లో ఫర్టిలైజర్స్, కెమికల్స్ వాడటం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారించానని చెబుతున్నారు అప్పలరాజు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల వల్ల బిపి, షుగర్, ఆస్తమా వంటి వ్యాధులు నయమవుతాయని ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలకు మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉందని అంటున్నారు ఈ యువ ఇంజనీర్. లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం కన్నా సేంద్రియ వ్యవసాయమే ఆనందాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..