Andhra Lace: ఇది కదా తెలుగువారి సత్తా..! ఒలింక్ క్రీడాకారులకు నర్సాపురం లేస్ ఉత్పత్తులు..!

విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలంపిక్స్ ఈసారి ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరం వేదిక కానుంది. యూరప్‌లో జరిగే ఈ విశ్వక్రీడల్లో ఈ సారి మన. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురలో తయారైన చేతి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Andhra Lace: ఇది కదా తెలుగువారి సత్తా..! ఒలింక్ క్రీడాకారులకు నర్సాపురం లేస్ ఉత్పత్తులు..!
Lace Products
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jul 12, 2024 | 12:00 PM

ఆంధ్రప్రదేశ్ హస్తకళలైన లేసు ఉత్పత్తులుకు మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది. విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించే ఒలంపిక్స్ ఈసారి ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరం వేదిక కానుంది. యూరప్‌లో జరిగే ఈ విశ్వక్రీడల్లో ఈ సారి మన. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురలో తయారైన చేతి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

జూలై నెల 26వ తేదీ నుంచి ఆగస్టు 11 వరకు ప్యారిస్ లో జరిగే ఒలంపిక్ క్రీడల్లో సీతారాంపురంలో తయారైన టవళ్లు, నాప్కిన్లు, పిల్లో కుషన్లు, బీచ్ టవల్స్ వంటి రోజువారీ వస్త్ర ఉత్పత్తులను క్రీడాకారులకు అందించనున్నారు. ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ (ఐఎల్‌సీ)కి అనుబంధంగా ఉన్న ఒక ట్రేడింగ్ సంస్థ వీటిని ఉత్పత్తి చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఇక్కడ చేసిన లేసు ఉత్పత్తులు అందించడం ఎంతో గర్వంగా ఉందని సీతారామపురంలోని లేసు కంపెనీ నిర్వాహకులు కలవకొలను రామచంద్రుడు అన్నారు.

ఈ కంపెనీ తరఫున నాలుగేళ్ల క్రితమే చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఒలింపిక్స్‌కు అందించాలని భావించారు. కేంద్ర చేతి వృత్తుల సంస్థ ఆధీనంలోని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండిక్రాప్స్ (ఈపీసీహెచ్) సహకారంతో ఈ ఆర్డర్ సాధించామని నిర్వహకులు తెలిపారు. ఆర్డరు దక్కించు కోవడానికి వంద రకాల నమూనాలను తయారు చేసి పంపగా, వాటిలో నాలుగు ఉత్పత్తులను స్పాన్సర్స్ ఎంపిక చేశారన్నారు. వాటిని థర్డ్ పార్టీ ద్వారా దిగుమతి చేసుకున్నారన్నారు. పంపించిన డిజైన్లు నచ్చడంతో ప్యారిస్ లోని కొంతమంది వ్యాపారులు కూడా ఒలింపిక్స్ సింబల్స్ ఉన్న లేసు అండ్ క్లాత్ ఉత్పత్తులను ఆర్డర్ ఇచ్చి దిగుమతి చేసుకున్నారని తెలిపారు.

ఒలింపిక్స్‌లో లేను, క్లాత్ అనుబంధంతో తయారైన ఉత్పత్తులను క్రీడాకారులకు, ప్యారిస్ విచ్చేసే క్రీడాభిమానులకు అందించేందుకు ఈ ఆర్డర్ కోసం ఎంతో శ్రమ పడ్డామని కలవకొలను రామచంద్రుడు తెలిపారు. కొవిడ్ తర్వాత లేసు పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సమయంలో ఒలంపిక్ ఆర్డర్ దక్కడం చాలా శుభ పరిణామం అన్నారు. ప్రాన్స్ లో జరిగే ఒలంపిక్స్ క్రీడాకారులకు, విచ్చేసే క్రీడాభిమానులకు కావలసిన టవల్స్ నాప్కిన్స్, పిల్లో కవర్లు టవల్స్ మారుమూల గ్రామం అయిన సీతారామాపురంలో తయారు చేసినందుకు గర్వంగా ఉందని లేస్ ఉత్పత్తులు తయారు చేసిన మహిళలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..