AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamala Harris: అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్..! ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు

అమెరికాలో 2024 నవంబర్‌ 5న జరగబోయే ఎన్నికల కోసం యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధ్యక్ష ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా జరగనున్నాయి. అధ్యక్ష రేసులో భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ఉండే అవకాశముందన్న చర్చ నేపథ్యంలో ఇది మరింత ఆసక్తిగా మారిపోయాయి.

Kamala Harris: అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్..! ఉపాధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు
Kamala Harris
Janardhan Veluru
| Edited By: Ravi Panangapalli|

Updated on: Jul 16, 2024 | 10:14 AM

Share

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ప్రెసిడెంట్‌ రేసులో చివరకు నిలబడి తలపడేది ఎవరన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్‌ పార్టీ నుంచి ఆ దేశ ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలుస్తున్నారు. వారిద్దరూ ఎన్నికల క్యాంపైన్ కూడా మొదలుపెట్టేశారు. అయితే ఇప్పుడు  అధ్యక్ష పదవికి ఒక్కసారిగా భారత వారసత్వ మూలాలున్న కమలా హారిస్ పేరు తెరమీదకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరిలో జో బైడెన్‌కు బదులు కమలా హారిస్‌ను డెమోక్రాట్ పార్టీ చివరి క్షణంలో బరిలో నిలిపే ఛాన్స్ ఉందన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున ఒహియో సెనేటర్ జె.డి.వాన్స్ పేరు ఖరారయ్యింది. వాన్స్ సతీమణీ ఉషా చిలుకూరి కూడా భారతీయ మూలాలున్న వ్యక్తే కావడం విశేషం. అలా రేసులో ఉన్న రెండు పార్టీల నుంచి కీలక పదవులకు పోటీ పడుతున్న వారిలో భారత్‌తో ఏదో విధంగా సంబంధం ఉండటంతో ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే  అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బైడెన్ కాదంటే.. కమలాకే ఛాన్స్.. ఇటీవల నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో అధ్యక్షుడు బైడెన్ తడబడగా.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధించారు. బైడెన్ మతిమరుపు వ్యాధితో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి