Singapore: సూర్యాపేటకు చెందిన యువకుడు సింగపూర్‌లో అనుమానాస్పద మృతి.. బీచ వద్ద మృతదేహం గుర్తింపు
కోదాడకు చెందిన పల్లీ వ్యాపారి చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణ లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు పవన్ కూడా సింగపూర్ లో పవన్ (28) ఏడాదిన్నరగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తూనే పవన్ అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని సెయింట్ టోసా బీచ వద్ద పవన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
బతుకుదెరువు కోసం సింగపూర్ కు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మునిరవుతున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన పల్లీ వ్యాపారి చౌడవరపు శ్రీనివాసరావు, చంద్రకళ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు హరికృష్ణ లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు పవన్ కూడా సింగపూర్ లో పవన్ (28) ఏడాదిన్నరగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తూనే పవన్ అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని సెయింట్ టోసా బీచ వద్ద పవన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పవన్ ఐడెంటిటీ కార్డు ఆధారంగా లండన్ లో ఉన్న సోదరుడు హరికృష్ణకు విషయం చెప్పారు. తమ్ముడు మృతిచెందిన విషయాన్ని పెద్ద కొడుకు హరికృష్ణ.. కోదాడలోని తల్లిదండ్రులకు చెప్పారు.
పవన్ మృతితో కోదాడలో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. త్వరలోనే సింగపూర్ నుంచి తిరిగి వచ్చి అమెరికా వెళ్ళేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం పవన్ తమతో మాటలు చివరిసారిగా మాట్లాడాడన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పవన్ మృతదేహాన్ని కోదాడకు తెప్పించాలని తల్లిదండ్రులు మంత్రి ఉత్తమమ్ కుమార్ రెడ్డి, అధికారులను కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..