అమెరికాలో మళ్లీ కాల్పులు.. బర్త్ డే పార్టీలో విషాదం.. నిందితుడి సహా ఐదుగురు మృతి
తెల్లవారుజామున 2:50 గంటలకు ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఫ్లోరెన్స్‌లోని ఒక ఇంటిలో ఉన్న ఏడుగురి వ్యక్తులపై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు విభాగం తెలిపింది. ఈ కాల్పుల్లో అక్కడిక్కడే నలుగురు చనిపోయారని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను సిన్సినాటిలోని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు అధికారి చెప్పారు.
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని కెంటకీలోని ఓ ఇంట్లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత ఇంట్లో నుంచి పారిపోతుండగా హతమైనట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద దాడి పారిపోతున్న వ్యక్తి కారును పోలీసులు వెంబడించారు. ఈ సమయంలో అనుమానితుడి కారు కాలువలో పడిందని.. దాని కారణంగా అతను మరణించాడని పోలీసులు చెప్పారు.
తెల్లవారుజామున 2:50 గంటలకు ఈ దారుణ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఫ్లోరెన్స్‌లోని ఒక ఇంటిలో ఉన్న ఏడుగురి వ్యక్తులపై కాల్పులు జరిగినట్లు నగర పోలీసు విభాగం తెలిపింది. ఈ కాల్పుల్లో అక్కడిక్కడే నలుగురు చనిపోయారని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను సిన్సినాటిలోని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు అధికారి చెప్పారు.
కారు కాలువలో పడిన అనుమానితుడి
నిందితుడు కారులో పారిపోతుండగా పోలీసులు వెంబడించినట్లు.. ఆ సమయంలో కారు అదుపుతప్పి కాలువలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని తన కుమారుడి బర్త్ డే పార్టీకి పలువురిని ఆహ్వానించాడు. భారీగా జనం తరలివచ్చారని మల్లేరి తెలిపారు. పార్టీ జరుగుతుండగా 20 ఏళ్ల యువకుడు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు.. ఈ కాల్పుల్లో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయాడని పోలీసు అధికారి వెల్లడించారు. నివేదిక ప్రకారం దర్యాప్తులో 20 ఏళ్ల నిందితుడికి పార్టీకి వచ్చిన వ్యక్తుల గురించి ముందే తెలుసునని.. అయితే ఆ యువకుడిని పుట్టిన రోజు పార్టీకి ఆహ్వానించలేదని తెలుస్తోంది.
నా భావాలు బాధితులతో ఉన్నాయి దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో తనకు తెలుసునని అయితే ఫ్లోరెన్స్‌లో భారీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి అని మల్లెరి అన్నారు. ఇది చాలా విచారించాల్సిన సంఘటన అని అన్నారు. బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..