AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈశాన్య భారతంలో భారీ ఉగ్ర కుట్ర.. అమెరికా పౌరుడు సహా ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్..!

ఈశాన్య భారతంలో తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులను , ఓ అమెరికా పౌరుడిని NIA అరెస్ట్‌ చేసింది. మిజోరాం మీదుగా మయన్మార్‌కు వెళ్లి ఉగ్రవాద శిబిరాలను వీళ్లు నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది. కోల్‌కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఈ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ఏడుగురికి ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు 11 రోజుల రోజుల కస్టడీకి అప్పగించింది.

ఈశాన్య భారతంలో భారీ ఉగ్ర కుట్ర.. అమెరికా పౌరుడు సహా ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్..!
Nia, National Investigation Agency
Balaraju Goud
|

Updated on: Mar 17, 2026 | 8:44 PM

Share

ఈశాన్య భారతంలో భారీ ఉగ్రకుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భగ్నం చేసింది. ఆరుగురు ఉక్రెయిన్‌ పౌరులతో పాటు ఓ అమెరికన్‌ పౌరుడిని NIA అరెస్ట్‌ చేసింది. భారతదేశంలో అక్రమంగా ప్రవేశించిన ఈ ముఠా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఆయుధ శిక్షణ ఇస్తునట్టు గుర్తించారు. ముఖ్యంగా తీవ్రవాదులకు డ్రోన్లల వాడకంలో శిక్షణ ఇస్తునట్టు తేలడం తీవ్ర సంచలనం రేపింది. మిజోరాం మీదుగా ఈ ముఠా మయన్మార్‌లో ప్రవేశించింది. అక్కడ తీవ్రవాద గ్రూపులకు అధునాతన ఆయుధాల్లో శిక్షణ ఇస్తునట్టు గుర్తించారు. కోల్‌కతా, లక్నో, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఈ ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ఏడుగురికి ఢిల్లీ ఎన్‌ఐఏ కోర్టు 11 రోజుల రోజుల కస్టడీకి అప్పగించింది.

UAPA చట్టం కింద ఏడుగురిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో విదేశీయులు ప్రయాణం చేయాలంటే ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ తీసుకోవాలి. కానీ ఈ ఏడుగురు ఎలాంటి అనుమతి లేకుండానే మిజోరాంలో పర్యటించారు. అక్కడి నుంచి మయన్మార్‌ వెళ్లారు. తీవ్రవాదుల కోసం ఈ ముఠా మయన్మార్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్టు గుర్తించారు. అమెరికా జాతీయుడిని మాథ్యూ వాన్‌డైక్‌గా గుర్తించారు. ఉక్రెయిన్ జాతీయులు హుర్బా పెట్రో, స్లివియాక్ టారాస్, ఇవాన్ సుక్‌మానోవ్‌స్కీ, స్టెఫాంకివ్ మారియన్, హోంచరుక్ మాక్సిమ్, కమిన్‌స్కీ విక్టర్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు వారిని 11 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. అరెస్టయిన వారిలో అమెరికా పౌరుడు మాథ్యూ వాన్‌డైక్‌ చాలా కీలకమని జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.

లిబియా యుద్దంలో మాథ్యూ వాన్‌డైక్‌ పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయని ఎన్‌ఐఏ భావిస్తోంది. అంతేకాకుండా నేషనల్ లిబరేషన్‌ ఆర్మీ తరపున గడాఫీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. అటు సిరియాలో ఐసిస్‌కు వ్యతిరేకంగా యుద్దంలో పాల్గొన్నాడు. ఉక్రెయిన్‌ బలగాల తరపున రష్యాతో యుద్దంలో పాల్గొన్నాడు. ఇలాంటి వ్యక్తి ఈశాన్య భారతంలో తిష్ట వేయడం తీవ్ర కలకలం రేపింది. కీవ్‌లో ఉక్రెయిన్‌ బలగాలకు శిక్షణ ఇస్తున్న వ్యక్తి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేయడం నిఘా వర్గాలను కలవరపెడుతోంది.

పద్నాలుగు మంది ఉక్రేనియన్ జాతీయులు వేర్వేరు తేదీలలో పర్యాటక వీసాలపై భారతదేశంలోకి ప్రవేశించారని ఎన్ఐఏ అనుమానిస్తోంది. వారు సరైన పత్రాలు లేకుండా అస్సాంలోని గౌహతికి, ఆ తర్వాత మయన్మార్ సరిహద్దు రాష్ట్రమైన మిజోరాంకు విమానాల్లో ప్రయాణించారు. చివరకు మయన్మార్‌లోకి ప్రవేశించారు. ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించిన తర్వాత, భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. మాకు పరిస్థితి గురించి తెలుసు, కానీ గోప్యతా కారణాల వల్ల అమెరికా పౌరులకు సంబంధించిన కేసులపై మేము వ్యాఖ్యానించలేము అని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. మిగతా ఆరుగురు నిందితులు ఉక్రెయిన్ జాతీయులని, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఉక్రెయిన్ పౌరుల బంధువులతో ఉక్రెయిన్ దౌత్య కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us