వేసవిలో ఎప్పుడై హైడ్రేట్‌గా ఉండాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!

Samatha

17 march 2026

వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలా మంది అలసట, నీరసం, శరీరంలో వేడి వంటి సమస్యలో ఎక్కువగా బాధపడుతుంటారు. అందుకే సమ్మర్‌లో ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు.

వేసవి

మరి వేసవిలో ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండాలి అంటే ఏం చేయాల? ఎలాంటి టిప్స్ పాటించడం వలన బాడీ హైడ్రేట్‌గా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హైడ్రేట్

సమ్మర్‌లో ఎప్పుడూ నీరు తాగుతూ ఉండాలి. దాహం వేసినా, వేయకపోయినా ఎక్కువ నీళ్లు తాగడం వలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

నీరు తాగడం 

సమ్మర్ ప్రారంభం అయిందంటే భానుడి భగ భగలు  ఇబ్బంది పెడతుంటాయి. అందుకే మధ్యాహ్నం ఎండకు దూరంగా ఉండాలి. బయటకు వస్తే గొడుగు వాడటం మంచిది.

నీరు తాగడం 

వేసవిలో ఎక్కువగా నీటి శాతం ఉండే పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

సీజనల్ ఫ్రూట్స్

అదే విధంగా వేసవిలో అస్సలే స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. ఇది అనేక ఇబ్బందులకు గురి చేస్తుంది. చాలా వరకు స్పైసీ లేని ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.

స్పైసీ ఫుడ్

అలాగే సమ్మర్ లో వీలైనంత వరకు కాటన్ దుస్తులు ధరించాలి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎండ ప్రభావం కూడా అంతగా ఉండదు.

కాటన్ దుస్తులు

ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువగా నిమ్మకాయ నీళ్లు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంటాయి. శరీరంలో వేడిని తగ్గిస్తాయి.

లెమన్ వాటర్