ఈ ఏడుగురు గ్రీన్ టీ అస్సలే తాగకూడదు.. తాగితే ప్రమాదమే!

Samatha

17 march 2026

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది టీ, కాఫీలను పక్కన పెట్టి ఎక్కువగా గ్రీన్ టీ తాగుతుంటారు.

గ్రీన్ టీ

అయితే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఈ ఏడు సమస్యలు ఉన్నవారు అస్సలే తాగకూడదంట. వారు ఎవరో చూద్దాం.

అనారోగ్య సమస్యలు

కాఫీ కంటే గ్రీన్ టీలో కెఫిన్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ కెఫిన్ మొత్తానికే పడని వారు గ్రీన్ టీ కూడా తాగకూడదంట. లేకపోతే ఇది ఆందోళను పెంచుతుంది.

కెఫిన్ పడని వారు

నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడే వారు కూడా గ్రీన్ టీకి ఎంత దూరంగా ఉంటే, అంత మంచిది. లేకపోతే ఇది సమస్యను తీవ్రతరం చేసే ఛాన్స్ ఉన్నదంట.

నిద్రలేమి

అలాగే ఐరన్ లోపంతో బాధపడే వారు గ్రీన్ టీ కి ఎంత దూరం ఉంటే, అంత మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇది అనీమియాకు దారి తీస్తుందంట.

ఐరన్ లోపం

పాలిచ్చే తల్లులు కూడా గ్రీన్ టీ అతిగా తీసుకోకూడదంట. ఇది శిశువు పై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

పాలిచ్చే తల్లులు

ప్రెగ్నెంట్ లేడీస్ కూడా గ్రీన్ టీ తాగకూడదంట. ఇది అతిగా తీసుకోవడం వలన శిశువు తక్కువ బరువుతో పుట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.

ప్రెగ్నెంట్ సమయంలో

అదే విధంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారు అస్సలే గ్రీన్ టీ అతిగా తీసుకోకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు

జీర్ణ సమస్యలు ఉన్నవారు