AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ విలన్‌ గురించి తెలుసా? ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వివాహం, ఆపై విడాకులు.. ఇప్పటికీ..

పలు తమిళ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైపోయిన పార్తీబన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్‌ గురించి తెలుసా? ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వివాహం, ఆపై విడాకులు.. ఇప్పటికీ..
Parthiban
Basha Shek
|

Updated on: Mar 17, 2026 | 8:44 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ పార్తీబన్ ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. మల్లా నాగప్ప అనే పవర్ ఫుల్ విలన్ రోల్ లో పార్తీబన్ కనిపించనున్నారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్తీబన్ డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఆయన ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. కాగా ఆర్ పార్తీబన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్ అని చెప్పవచ్చు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, సింగర్ గా.. తదితర రంగాల్లో సత్తా చాటారాయన. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ఆరంభించిన పార్తీబన్ దాదాపు 16 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. అలాగే దాదాపు 14 సినిమాలకు నిర్మాతగా పని చేశారు. వందకుపైగా సినిమాల్లో యాక్టర్‌గా చేశారు. రచయితగా, సింగర్‌గానూ తన టాలెంట్‌ చాటుకున్నారు. ముఖ్యంగా యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌ 1, పొన్నియన్‌ సెల్వన్‌ 2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా చేరువయ్యారు పార్తీబన్.

సినిమాల సంగతి పక్కన పెడితే.. పార్తీబన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. పార్తీబన్ ఓ తెలుగు నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే మాజీ భార్యపై ప్రేమతో గత 24 ఏళ్లుగా సింగిల్ గానే ఉంటున్నాడు పార్తీబన్. ఆమె మరెవరో కాదు సీత. ఇలా పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ ముద్దుల మావయ్య సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించిన అమ్మాయి ఇంటే గుర్తు పడతారు. ముత్యమంత ముద్దు, పోలీస్ భార్య, చెవిలో పువ్వు వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది సీత. ఆ తర్వాత గంగోత్రి, సింహాద్రి, దేనికైనా రెడీ, బన్నీ, గౌతమ్ నంద, డెవిల్, మనవే వంటి ఎన్నో సినిమాల్లో సహాయక నటిగా చేసింది.

ఇవి కూడా చదవండి

పార్తీబన్‌ 1990లో నటి సీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఒక కుమారుడిని దత్తత తీసుకున్నారు. 2001లో పార్తీబన్‌- సీత విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి పార్తీబన్ ఒంటరిగానే ఉంటున్నాడు. ‘నేను ఇప్పటికీ సీతను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందుకే 24 ఏళ్లయినా మళ్లీ పెళ్లి చేసుకోలేదు. నా భార్యగా సీతకు స్థానమిచ్చాను. దాన్ని మరొకరికి ఇవ్వలేను. మా ఇద్దరమ్మాయిలకు పెళ్లయింది. నా కొడుకు​, నేను మాత్రం ఇంకా సింగిల్‌గానే ఉంటున్నాం. సీతతో నేను టచ్‌లో లేను. కానీ ఆమె తల్లి చనిపోయినప్పుడు మాత్రం వెళ్లి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించాను’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పార్తీబన్.

కూతురు పెళ్లిలో పార్తీబన్, సీత

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us