ఈ గింజలను గుర్తుపట్టారా? నీళ్లలో కాసిన్ని వేసి నానబెట్టి తాగితే..
17 March 2026
TV9 Telugu
TV9 Telugu
వేసవి కాలం దాదాపు ప్రారంభమైనట్లే. ఈ కాలంలో ఉండే తీవ్రమైన వేడి కారణంగా డీహైడ్రేషన్, అలసట, నీరసం, ఒళ్ళు నొప్పులు, వడదెబ్బ, జీర్ణ సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి
TV9 Telugu
అందువల్ల ఈ కాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఇటువంటి పరిస్థితులలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడటానికి కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ వంటి వాటిని జనాలు ఆశ్రయిస్తుంటారు
TV9 Telugu
వీటితో పాటు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి సోంపు గింజల నీటిని కూడా తాగవచ్చు. ఇవి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి
TV9 Telugu
ఆయుర్వేదం ప్రకారం వేసవిలో శరీరంలో 'పిత్త దోషం' పెరిగి వేడి, వాపు, ఎసిడిటీకి కారణమవుతుంది. సోంపుకు చల్లదనాన్నిచ్చే గుణాలు ఉండటం వల్ల, అది పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది
TV9 Telugu
కాబట్టి వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం పరగడుపున సోంపు నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, వడదెబ్బ తగిలే ప్రమాదం తగ్గుతుంది. ఇది మండుటెండలో కూడా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది
TV9 Telugu
అలాగే ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు కూడా సోంపు నీళ్లు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపును తేలికగా ఉంచుతాయి
TV9 Telugu
సోంపుకు సహజంగా శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణాలు ఉంటాయి. వీటి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి మండు వేసవిలో బయటకు వెళ్లే ముందు సోంపు నీళ్లు తాగడం మంచిది
TV9 Telugu
సోంపు నీళ్లు శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలను సహజంగా శుభ్రపరుస్తుంది. తద్వారా కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది