Kulgam Encounter: కుల్గామ్‌లో 2 వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు మృతి, ఇద్దరు జవాన్లు వీర మరణం

కుల్గాం జిల్లా మోదర్‌గామ్‌ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది.

Kulgam Encounter: కుల్గామ్‌లో 2 వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు మృతి, ఇద్దరు జవాన్లు వీర మరణం
Kulgam Encounter
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2024 | 7:24 AM

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని రెండు రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. జిల్లాలోని    మోదర్‌గామ్ తర్వాత, చిన్నగాం ప్రాంతంలో భద్రతా బలగాలు , ఉగ్రవాదుల మధ్య శనివారం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించగా, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.  కాల్పులు కొనసాగుతున్నాయని, మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరుగుతోందని చెప్పారు.

కుల్గాం జిల్లా మోదర్‌గామ్‌ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారని ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న సీఆర్‌పీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో అక్కడ ఉగ్రవాదులు జరిపిన కాల్పులతో ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారింది. ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఇద్దరు సైనికులు అమరులైనట్లు అధికారులు తెలిపారు.

కుల్గామ్‌లోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఎన్‌కౌంటర్

Contact established at Frisal Chinnigam area in #Kulgam district. Police and security forces are on job. Further details shall follow.@JmuKmrPolice

ఇవి కూడా చదవండి

— Kashmir Zone Police (@KashmirPolice) July 6, 2024

ఆయా ప్రాంతాలను  చుట్టుముట్టిన భద్రతా బలగాలు

ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించిన కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) వికె బిర్ధి మాట్లాడుతూ, కొన్ని ఉగ్రవాదుల మృతదేహాలు కనిపించాయని, అయితే ఎన్‌కౌంటర్ ఇంకా ముగియలేదని చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారికి సమీపంలో లేదని, అంతకుముందు కుల్గాం జిల్లా మోదర్గామ్ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. రెండు ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, భద్రతా బలగాలు ఆయా ప్రాంతాలను పటిష్టంగా చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!