AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..

కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. నగరంలోని టూ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్ర శేఖర్ భార్య దివ్వ ఆత్మహత్యకు పాల్పడింది. గన్నేరుపప్పు దంచుకుని తిన్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Telangana: ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..
Karimnagar Suicide
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 18, 2026 | 2:05 PM

Share

నగరంలోని టూటౌన్ పీఎస్‌లో ఎస్సైగా పని చేస్తున్న చంద్ర శేఖర్ భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెల్తే.. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హునుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న చంద్ర శేఖర్‌కు,దివ్య అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీళ్లకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మంగళవారం ఇంట్లోనే ఉన్న దివ్వ గన్నేరు పప్పు దంచుకొని తిన్నట్టు తెలుస్తోంది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో దివ్వ తీవ్ర అస్వస్థకు గురైంది. విషయం తెలుసకున్న భర్త చంద్రశేఖర్ వెంటనే దివ్యను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించండంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే దివ్వ మరణించారు. ఈ విషయం తెలిసిన భర్తతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిరు ప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే దివ్వ కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిరాలి భర్త చంద్రశేఖర్ చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా దివ్వ కడుపు నొప్పితో బాధ పడుతున్నారని అంటున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలో ఈ ఆత్మహత్య తీవ్ర విషదాన్ని నింపింది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించిన భార్య.. హాస్పిటల్‌కు తీసుకెళ్ల
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఈ ఫేస్‌ ప్యాక్‌ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇలా చేస్తే అందరి చూపు మీపై
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
ఫాస్టాగ్ వాహనదారులకు అలర్ట్.. మార్చి 31 డెడ్‌లైన్
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
పుట్టగొడుగులు తింటున్నారా ?? అయితే ఈ భాగాన్ని అస్సలు తినకండి
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
నువ్వు నేను సినిమాకు రాస్తే జయం మూవీతో హిట్టు..
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
తండ్రిని బాక్స్‌లో పెట్టి కొరియర్ చేసిన యువతి.. ఎందుకో తెలిస్తే..
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
నూనె‌లో కాదు.. అక్కడ పూరీలను నీటిలో వేయిస్తారు.. నమ్మండి ఇది నిజం
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఎవరికీ నచ్చకపోయినా హిట్టు కొట్టాను.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డ
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి
ఇరాన్‌ యుద్ధం.. సామాన్యుడి సొంతింటి కల భస్మం..! నిర్మాణ సామగ్రి