Viral Video: వంటలతో వింతలు చేస్తున్న వ్యక్తులు.. వేప ఆకులతో పరాఠా తయారీ.. వీడియో వైరల్..
కొంత మని వంటలతో వేరే స్థాయిలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పలంటే వంటలతో వింతలు చేయడం ప్రారంభించారు. ఇటీవల అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి వేప పరాఠాలను తయారు చేసాడు. వేప ఆకులు మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవని మనందరికీ తెలుసు, ఆయుర్వేద దృక్కోణంలో వేప చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దాని రుచి మీకు చేదుగా అనిపించినా.. వేపలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
కరోనా తర్వాత ఎక్కువ మంది ఆహారంతో వింత ప్రయోగాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తమదైన రీతిలో ప్రయోగాలు చేస్తూ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. ఇలా ఆహారంతో ప్రయోగాలు చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని వీడియోల్లోని ఆహార పదార్ధాలు రుచికరంగా ఉండి ఆకట్టుకుంటే.. మరికొన్ని అసలు ఇది తినడానికి చేస్తున్న వంటలేనా అనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొంత మని వంటలతో వేరే స్థాయిలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఇంకా చెప్పలంటే వంటలతో వింతలు చేయడం ప్రారంభించారు. ఇటీవల అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి వేప పరాఠాలను తయారు చేసాడు.
వేప ఆకులు మన శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవని మనందరికీ తెలుసు, ఆయుర్వేద దృక్కోణంలో వేప చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దాని రుచి మీకు చేదుగా అనిపించినా.. వేపలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం వేపపిండిని ఉదయాన్నే పరగడుపున సేవిస్తే శరీరంలోని సగం రోగాలు నయమవుతాయి. అయితే మీరు ఎప్పుడైనా వేపఆకులతో చేసిన పరాటాను తిన్నారా..! ప్రస్తుతం ఒక వ్యక్తి ఎంతో సంతోషంగా వేప పరాఠాలను తయారుచేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
రోడ్డుపక్కన నిల్చున్న వ్యక్తి వేప పరాటాలు సిద్ధం చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. దీని కోసం అతను మొదట వేప కొమ్మ నుంచి కొన్ని తాజా ఆకులను తీశాడు. అతను వాటిని శుభ్రంగా కడిగి చిన్నగా కత్తిరించాడు. దీని తరువాత అతను ఆ వేపాకుల ముక్కల్లో ఉల్లిపాయ, పన్నీరు, మసాలా పొడులు మొదలైనవాటిని జోడించి..వాటిని కలిపి మంచి మిశ్రమాన్ని సిద్ధం చేశాడు. దీని తరువాత, చపాతీ పిండి తీసుకుని రొట్టెలా చేసి అందులో ఈ మిశ్రమ పేస్ట్ ను పెట్టి పరాఠాను సిద్ధం చేశాడు. ఇప్పుడు పాన్ ను వేడి చేసి ఈ వెన్న వేసి పరాఠాను కాల్చాడు.
ఈ వీడియో InstagramలోAGRA Eatery శాఖాహార ఆహారం అనే ఖాతాలో షేర్ చేశారు. వేలాది వ్యూస్ ను రకరకాల కామెంట్స్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. ఇది చూసిన తర్వాత నా నోరు పూర్తిగా చేదుగా మారింది అని ఒకరు కామెంట్ చేస్తే ‘డయాబెటిక్ పేషెంట్లకు దీన్ని తినిపించాలి’ అని మరొకరు రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర ఖాతాదారులు రకరకాలుగా ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..