డాక్టర్ చంచల శర్మ, ఆశా ఆయుర్వేద డైరెక్టర్, గైనకాలజిస్ట్ మాట్లాడుతూ వంధ్యత్వ సమస్యను క్రమం తప్పకుండా యోగా సాధన ద్వారా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. దీని కోసం IVF చేయించుకున్న చాలా మంది రోగులు కూడా వస్తారని చెప్పారు. అయితే ఆయుర్వేద చికిత్స, యోగా సహాయంతో సహజంగా గర్భం దాల్చడంలో విజయం సాధించారు. యోగాసనం మీ సంతానోత్పత్తిని నేరుగా ప్రభావితం చేయదు.. బదులుగా ఇది అన్ని చికిత్సా ప్రక్రియలతో పాటు పనిచేస్తుంది.