AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమాసియాలో ఆగని భగభగలు.. మిత్రదేశాలతో కలిసి అమెరికా దండయాత్ర.. తిరగబడుతున్న ఇరాన్!

పశ్చిమాసియాలో అగ్గిపుల్ల గీసి యుద్ధాన్ని రాజేసిన అమెరికా.. అంతకంతకూ రెచ్చిపోతోంది. ఇజ్రాయెల్‌తో పాటు మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. ముఖ్యంగా ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని టార్గెట్ చేసినట్టు అమెరికా బహిరంగంగానే చెప్పుకుంటోంది. కొన్ని మిసైల్స్ అరబ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో ప‌డ‌టంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణంక్షణం భయభయంగా బతుకుతున్నారు.

పశ్చిమాసియాలో ఆగని భగభగలు.. మిత్రదేశాలతో కలిసి అమెరికా దండయాత్ర.. తిరగబడుతున్న ఇరాన్!
Us, Israel Attack On Iran
Balaraju Goud
|

Updated on: Mar 01, 2026 | 6:14 PM

Share

పశ్చిమాసియాలో అగ్గిపుల్ల గీసి యుద్ధాన్ని రాజేసిన అమెరికా.. అంతకంతకూ రెచ్చిపోతోంది. ఇజ్రాయెల్‌తో పాటు మిత్రదేశాలతో కలిసి ఇరాన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. ముఖ్యంగా ఇరాన్ డ్రోన్లు ఉన్న స్థావరాలు, కీలక మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని టార్గెట్ చేసినట్టు అమెరికా బహిరంగంగానే చెప్పుకుంటోంది. కొన్ని మిసైల్స్ అరబ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో ప‌డ‌టంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణంక్షణం భయభయంగా బతుకుతున్నారు.

సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీని కోల్పోయిన ఇరాన్ కూడా అహం దెబ్బతిని పెద్దన్నపై తిరగబడింది. ఇంతకింతా బదులు తీర్చుకుంటామంటోంది. ఇజ్రాయెల్‌, అమెరికా ఎయిర్‌బేస్‌లపై ప్రతిదాడులకు భారీస్థాయిలో ప్లాన్ చేస్తోంది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్. ఏ క్షణంలోనైనా భీకరమైన ఎటాక్‌ కంపల్సరీ అని సైగ చేస్తోంది. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్‌బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ హాకిర్యాను పేల్చివేయుడు పక్కా అంటోంది.

అటు, చైనా శాటిలైట్ల సాయంతో పశ్చిమాసియాలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాక్‌లోని ఇర్బిల్ ఎయిర్‌పోర్ట్‌ను ఎటాక్ చేయడంతో భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్‌ నుంచి ప్రయాణీకులను బైటికి పంపించారు. అటు, బహ్రెయిన్‌లోని యూఎస్ ఎయిర్‌బేస్‌లపై మిసైల్ ఎటాక్స్ జరగడంతో, అక్కడికి దగ్గరలో ఉండే తెలుగువాళ్లు హడలిపోతున్నారు. ఆదుకోవాలంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. UAEపై కూడా దాడులు కొనసాగిస్తోంది ఇరాన్‌. షార్జాలోని అతి పెద్ద షాపింగ్ మాల్‌ ధ్వంసమైంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. షాపింగ్‌మాల్‌లో కొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.

ఇరాన్‌పై US, ఇజ్రాయెల్ దాడులను ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఖమేనీని హత్య చేయడం నైతికత కాదని, ఐక్యరాజ్యసమితి సూత్రాలను తుంగలో తొక్కడమేనని ఆక్షేపించింది చైనా. ప్రపంచ శాంతి కోసం సైనిక కార్యాకలాపాలను తక్షణమే నిలిపివేసి, చర్చలు జరపాలని పిలుపునిస్తున్నాయి చైనా, రష్యా దేశాలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us