AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు మాస్కోకు భారత ప్రధాని పయనం.. 5 ఏళ్ల తర్వాత రష్యాలో పర్యటించనున్న మోడీ

ప్రధాని మోడీ మాస్కోకు చేరుకోవడానికి ముందు రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం అయిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శనివారం ప్రధాని మోడీ తమ దేశంలో పర్యటించనున్నారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ 22వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ జూలై 8, 9 తేదీలలో రష్యా రాజధాని మాస్కోలో ఉంటారు.

రేపు మాస్కోకు భారత ప్రధాని పయనం.. 5 ఏళ్ల తర్వాత రష్యాలో పర్యటించనున్న మోడీ
Pm Modi Russia Tour
Surya Kala
|

Updated on: Jul 07, 2024 | 11:56 AM

Share

భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు (సోమవారం) రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. మోడీ పర్యటనకు ముందు మాస్కో విడుదల చేసిన ప్రకటనలో రష్యా ‘చాలా ముఖ్యమైన పర్యటన’ కోసం ఆసక్తిగా ఉందని పేర్కొంది. భారత్, రష్యాల మధ్య పరస్పర సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని భావిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రధాని రష్యాను సందర్శించారు.

ప్రధాని మోడీ మాస్కోకు చేరుకోవడానికి ముందు రష్యా అధ్యక్షుడి అధికారిక నివాసం, కార్యాలయం అయిన క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ శనివారం ప్రధాని మోడీ తమ దేశంలో పర్యటించనున్నారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ 22వ భారత్, రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ జూలై 8, 9 తేదీలలో రష్యా రాజధాని మాస్కోలో ఉంటారు.

ప్రపంచ సమస్యలపై చర్చించనున్న ప్రధాని మోడీ

ఈ అత్యున్నత స్థాయి పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం న్యూఢిల్లీలో అందించింది. ఇరు దేశాల మధ్య బహుళ విషయాల పట్ల సంబంధాలను ఇద్దరు అగ్రనేతలు వివరంగా సమీక్షిస్తారని చెప్పారు. సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ఇరు దేశ నేతలు పరస్పరం చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ టెలివిజన్ VGTRKకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు మాస్కోలో ఇతర కార్యక్రమాలతో పాటు అనధికారిక చర్చలు కూడా జరుపనున్నారని అతను చెప్పారు. “అజెండా సమగ్రంగా ఉంటుందని.. ప్రధాని మోడీ అధికారిక పర్యటనలో ఇరు దేశాల నేతలు మాట్లాడుకోనున్నారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

భారతదేశం, రష్యా మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయిలో ఉన్నాయని పెస్కోవ్ అన్నారు. క్రెమ్లిన్‌లో ప్రతినిధుల మధ్య ముఖాముఖి చర్చలు జరుగుతాయని కూడా ఆయన చెప్పారు.

2019లో రష్యాలో చివరిసారిగా పర్యటించిన ప్రధాని మోడీ

అధికారిక వార్తా సంస్థ టాస్ కూడా భారత్ ప్రధాని మోడీ పర్యటన గురించి మాట్లాడుతూ తాము చాలా ముఖ్యమైన పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. ఈ పర్యటన రష్యా-భారత్ సంబంధాలకు చాలా ముఖ్యమైనదిగా పేర్కొంది.” గత ఐదేళ్లలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో ఫార్ ఈస్టర్న్ నగరమైన వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ హాజరయ్యారు. అదే ప్రధాని మోడీ చివరిసారిగా రష్యాను సందర్శించడం.

భారత ప్రధాని, రష్యా అధ్యక్షుల మధ్య జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి ఇరు దేశాలధినేతలు మాట్లాడుకోనున్నారు. ఇప్పటివరకు భారతదేశం, రష్యాలో 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు ప్రత్యామ్నాయంగా నిర్వహించారు. వార్షిక శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా న్యూఢిల్లీలో డిసెంబర్ 6, 2021న జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు వచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..