శీతాకాలంలో బెల్లం తినడం వల్ల శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. బెల్లంలోని జింక్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి, ఊపిరితిత్తుల రక్షణకు, రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణకు ఇది ప్రయోజనకరం. గొంతు నొప్పి, శ్లేష్మాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.