Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ముందు ఈ మొక్కను పెంచండి… ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు పరార్‌..!

ఇంట్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు, చీమలు, సూక్ష్మజీవులు సర్వసాధారణం. కానీ, అవి కలిగించే ఇబ్బంద ఇమాత్రం మామూలుగా ఉండదు. వీటివల్ల అనేక అంటురోగాలు వ్యాప్తి చెందే రిస్క్ కూడా ఉంటుంది. అటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోసం హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇలాంటి వాటిని ఇంటి నుంచి తరిమి కొట్టేందుకు ఇలాంటి మొక్కలను అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఇంటి ముందు ఈ మొక్కను పెంచండి... ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలు పరార్‌..!
Marigold
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2024 | 12:05 PM

ఇంటిని ఎంత శుభ్రం చేసినా బల్లులు, ఈగలు, చీమలు వస్తూనే ఉంటాయి. వంటగది, బాత్రూమ్‌ ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రతిచోటా బల్లులు, ఈగలు, చీమలు తిరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్ని మొక్కలు ఎలుకలు, బల్లులు, ఈగలు, దోమలతో సహా ఇంట్లో బాధించే కీటకాలను తొలగిస్తాయి. బాధించే క్రిమి కీటకాలను తరిమికొట్టే మొక్కలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం..

పుదీనా ఆకుల సువాసన మనకు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, కొన్ని కీటకాలకు అది నచ్చదు. అందులో బల్లి ఒకటి. పుదీనా మొక్కను ఇంట్లో పెడితే బల్లులే కాదు ఎలుకలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పిప్పరమెంటులో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. పుదీనా బల్లులు, ఎలుకలు తట్టుకోలేని ఘాటైన వాసనను వెదజల్లుతుంది.

బల్లులను తరిమికొట్టేందుకు నిమ్మ గడ్డిని కూడా నాటవచ్చు. ఇది ఒక రకమైన గడ్డి. పేరుకు తగ్గట్టుగానే ఈ గడ్డి నిమ్మకాయ రుచి, వాసనతో ఉంటుంది. దీని వాసన కారణంగా బల్లులు అక్కడి నుంచి పారిపోతాయి. అలాగే లెమన్ గ్రాస్ లో సిట్రోనిల్లా అనే ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. ఇది అనేక క్రిమిసంహారక స్ప్రేలలో కూడా ఉపయోగించబడుతుంది.

ఇవి కూడా చదవండి

బల్లుల సమస్య నుంచి బయటపడేందుకు మీరు బంతి పువ్వు మొక్కను కూడా పెంచుకోవచ్చు. బంతి పూలలో పైరెత్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. పెంపుడు బల్లులు బంతి పూల వాసన చూస్తే పారిపోతాయి.

రోజ్మేరీ మొక్క నుండి తీసిన నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఈ మొక్క వింత వాసనను కూడా వెదజల్లుతుంది. దీనివల్ల బల్లులు సహా ఈగలు, దోమలు ఇంట్లో ఉండవు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..