Viral Video: ఇల్లాలా మజాకా..! ఉతికేయడంలో ఉపాయం.. నయా వాషింగ్ మిషన్ కనిపెట్టిన మహిళ

‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హోమ్ మేడ్ వాషింగ్‌మెషిన్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా చూశారు. కాగా 4700 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Viral Video: ఇల్లాలా మజాకా..! ఉతికేయడంలో ఉపాయం.. నయా వాషింగ్ మిషన్ కనిపెట్టిన మహిళ
Woman Made Washing Machine
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 05, 2024 | 1:10 PM

మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన వాషింగ్ మెషీన్లు ప్రజలకు బట్టలు ఉతికే శ్రమను తగ్గించాయి. కానీ దాన్ని కొనడానికి అందరి దగ్గర డబ్బు ఉండదు. విద్యుత్ వినియోగం కూడా మారుతూ ఉంటుంది. పేదలు, సామాన్యులకు వాషింగ్‌ మెషీన్‌ అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. కానీ, అలాంటి వారు కూడా తమకు అందుబాటులో ఉన్న వస్తువులను వినియోగించుకుని వాషింగ్‌ మెషీన్లను తయారు చేసిన వీడియోలు గతంలో మనం సోషల్ మీడియాలో వైరల్‌ కావటం చూశాం. గతంలో ఓ మహిళ సైకిల్‌ వీల్‌ సాయంతో వాషింగ్‌ మెషిన్‌ వంటి టెక్నిక్‌ ప్లే చేసింది. ఇప్పుడు కూడా అలాంటిదే మరో కొత్త రకం వాషింగ్‌ మెషిన్‌ తయారు చేసింది ఓ ఇల్లాలు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక మహిళ ఇంట్లో ఇటుకలు, సిమెంట్ సహాయంతో వాషింగ్ మెషీన్ను తయారు చేసింది. దానికి ఓ వైపు నీళ్లు నిలబడేందుకు తొట్టి ఆకారంలో నిర్మించి, రెండో వైపు బట్టలు ఉతికేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంది.ఈ వీడియో చూసిన ప్రజలు దీనిని దేశీ వాషింగ్ మెషీన్ అని పిలుస్తున్నారు. ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌లో పదే పదే బకెట్ నీళ్లు మార్చకుండా.. తొట్టి కింది భాగంలో మురికి నీరు వెళ్లేలా ఇంకొ కొళాయి ఏర్పాటు చేసింది. ఇలా మురుగు నీటిని బయటకు వదలడం, ట్యాప్‌ ఓపెన్‌ చేసుకుని ఎప్పటికప్పుడు మంచి నీటిని ఆ తొట్టిలో నింపుకుంటూ బట్టలు శుభ్రం చేస్తోంది. ఇక అక్కడే తిష్టవేసుకుని కూర్చునే పని లేకుండా నిలబడే సులభంగా బట్టలన్నింటినీ ఉతికేసింది. ఈమె తెలివి చూసిన నెటిజనం ఆశ్చర్యపోయారు. ఏం తెలివి అక్క నీది అంటూ ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by mahi (@mahi00000p)

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హోమ్ మేడ్ వాషింగ్‌మెషిన్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 27 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా చూశారు. కాగా 4700 మందికి పైగా దీన్ని లైక్ చేశారు. పోస్ట్‌పై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే