Beauty Tips: నువ్వులతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.. ఇలా వాడితే బోలెడు లాభాలు..!

Sesame Seeds: నువ్వుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అంటూ వేర్వేరుగా ఉన్నా రెండింటికీ ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు. ఇందులోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే నువ్వులు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, అందానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? నువ్వులు అందానికి ఎలా ఉపయోగపడతాయనే ఆలోచిస్తున్నారు కదూ! అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 05, 2024 | 10:46 AM

ఆరోగ్యామే కాకుండా చర్మ అందాన్ని కాపాడాడంలో కూడా నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నువ్వుల్లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి ఉపయోగపడతాయి. అలాగే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించడంలో సహాయపడుతాయి. సూర్యుడి కిరణాల నుంచి కూడా చర్మాన్ని సంరక్షించడంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి.

1 / 6
నువ్వులను ఆహారంలో భాగం చేసుకున్నా చర్మంపై ఉండే ముడతలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం వంటి పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా నువ్వుల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ముఖంపై ఏర్పడే వాపులను తగ్గిస్తాయి. మొటిమలు, తామర వంటి సమస్యలను దరిచేరకుండా చస్తాయి.

2 / 6
నువ్వుల నూనె మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు నువ్వుల నూనెను ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తే, కొద్ది రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.

3 / 6
నువ్వులతో ఫేస్‌కి స్క్రబ్‌ కూడా చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా తేనె కలిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల పాటు ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

4 / 6
నువ్వుల పొడి కూడా సహజ క్లెన్సర్‌గా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ నువ్వుల పొడిని ఒక టీస్పూన్ శెనగపిండి, కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లో తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 10 నిమిషాలు ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

5 / 6
నల్ల నువ్వులు రోజూ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి శరీరాన్ని ఉత్తేజంగా చేస్తుంది. ఇందులోని పోషకాలు వయసు పెరిగినా అందంగా కనబడేలా చేస్తాయి. షాంపూల వాడకం వల్ల జుట్టు తెల్లబడిపోతుంది. అయితే నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే ఇందులోని పోషకాలు జుట్టుకు బలాన్నిస్తాయి.

6 / 6
Follow us