- Telugu News Photo Gallery Cinema photos Is Hero Allari Naresh in confusion in selecting movies, comedy or serious Telugu Heroes Photos
Allari Naresh: కన్ఫ్యూజన్ లో అల్లరి నరేష్.? ఎటు తేల్చుకోలేని పరిస్థితి.. ఎందుకంటే.?
అల్లరి నరేష్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా..? ఓసారి కామెడీ.. మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా..? ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు.. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఇంతకీ నరేష్ పేరు ముందు అల్లరి మాయమవ్వడానికి కారణమేంటి..? అల్లరి నరేష్‌ను ఇలా సీరియస్‌గా చూడటం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్.
Updated on: Jul 05, 2024 | 9:46 PM

అల్లరి నరేష్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారా..? ఎటువైపు వెళ్లాలో తెలియని డైలమాలో పడిపోయారా..? ఓసారి కామెడీ.. మరోసారి సీరియస్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారా..?

ఈ డౌట్ ఇప్పుడెందుకు వచ్చిందబ్బా అనుకోవచ్చు.. కానీ ఆయన చేస్తున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఇంతకీ నరేష్ పేరు ముందు అల్లరి మాయమవ్వడానికి కారణమేంటి..?

అల్లరి నరేష్‌ను ఇలా సీరియస్‌గా చూడటం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్. కానీ ఆయన మాత్రం సీరియస్ రోల్స్ కూడా ఇరగదీస్తారు.. అందులో అనుమానం లేదు.

అందుకే ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు నరేష్. ఓ వైపు కామెడీ.. మరోవైపు సీరియస్.. రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడు అల్లరోడు. రెండేళ్ల కింద నాందీతో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్.. తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు.

ఇక నా సామిరంగాలోనూ నవ్విస్తూనే.. ఏడిపించారు నరేష్. ఈ మధ్యే ఆ ఒక్కటి అడక్కులో కామెడీ చేసారు. కానీ అది అస్సలు వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లితో వస్తున్నారు నరేష్.

తాజాగా బచ్చల మల్లి గ్లింప్స్ విడుదలైంది. ప్రతీ సినిమాలోను నరేష్ పేరు ముందు అల్లరి అని ఉంటుంది. కానీ బచ్చల మల్లిలో అది మాయమైంది. కేవలం నరేష్ అని మాత్రమే చూపించారు దర్శకుడు సుబ్బు.

అంటే ఇకపై అల్లరికి దూరంగా ఉండి.. సీరియస్ సినిమాలు చేయాలనుకుంటున్నారా అనేది సస్పెన్సే. ఏం చేసినా.. నరేష్‌కు అయితే ఇప్పుడో బ్లాక్‌బస్టర్ అవసరం చాలా ఉంది.





























