- Telugu News Photo Gallery Cinema photos Prabhas's Kalki 2898 AD Movie Box Office Collection crossed Rs.700 crore Telugu Heroes Photos
Prabhas – Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ హవా.. కల్కి జోరు మరింత పెరుగుతుందా.?
కల్కి 2898 ఏడీ హవా కొనసాగుతోంది. ఆల్రెడీ వెయ్యి కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్న ఈ సినిమాకు మరో అడ్వాంటేజ్ యాడ్ అవ్వబోతోంది. దీంతో వసూళ్ల స్పీడు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది.
Updated on: Jul 05, 2024 | 8:08 PM

కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. ఆల్రెడీ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్న ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఆ జోష్ డబుల్ అవుతోంది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఆ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది.

ఇండియన్ మార్కెట్‌తో పాటు ఓవర్ సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ నెంబర్స్‌ను టచ్ చేస్తోంది ఈ మూవీ. తాజాగా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ యాడ్ అయ్యింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ ధరలు భారీగా ఉన్నాయి.

కానీ శుక్రవారం నుంచి ఆ రేట్స్ తగ్గబోతున్నాయి. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. దీంతో మరోసారి వసూళ్ల విషయంలో కొత్త స్పైక్ కనిపించబోతుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

కల్కి జోరుతో ఫుల్ హ్యాపీగా ఉన్న మేకర్స్ ఆల్రెడీ సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చేశారు. ఈ ఏడాదే సీక్వెల్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.

ఈ సారి గ్రాఫిక్స్ వర్క్ మరింత భారీగా ఉండబోతుందని, అందుకే పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కవు టైమ్ పడుతుందని చెప్పారు.

భారీ పాన్ ఇండియా మూవీస్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్ కే సొంతమని చెప్పేందుకు కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.




