- Telugu News Photo Gallery Cinema photos Bollywood Hero Ranveer Singh looking for a solid comeback Telugu Heroes Photos
Ranveer Singh: బాలీవుడ్‌ని దున్నేస్తాడని కబుర్లు చెప్పి.. ఇప్పుటికి అవకాశాలకోసం చూపులు.
ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు. షారుక్ ఖాన్ రిటైర్ అయితే.. అంతా ఆయనే చూసుకుంటాడన్నారు. బాలీవుడ్‌ని దున్నేస్తాడని కబుర్లు బాగానే చెప్పారు. తీరా అతడి తీరు చూస్తుంటే ఇప్పుడు అలాంటి సీన్స్ ఏం కనిపించడం లేదు. కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు.. ముందు ఒక్క సినిమా కూడా సెట్స్‌పై లేదు. అసలేమైంది ఆ హీరోకు..? ఇంతకీ ఈ ఇంట్రో అంతా ఎవరి గురించో తెలుసా..? రణ్‌వీర్ సింగ్..
Updated on: Jul 05, 2024 | 7:39 PM

ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు. షారుక్ ఖాన్ రిటైర్ అయితే.. అంతా ఆయనే చూసుకుంటాడన్నారు. బాలీవుడ్‌ని దున్నేస్తాడని కబుర్లు బాగానే చెప్పారు. తీరా అతడి తీరు చూస్తుంటే ఇప్పుడు అలాంటి సీన్స్ ఏం కనిపించడం లేదు.

కొత్త సినిమాల సంగతి దేవుడెరుగు.. ముందు ఒక్క సినిమా కూడా సెట్స్‌పై లేదు. అసలేమైంది ఆ హీరోకు..? ఇంతకీ ఈ ఇంట్రో అంతా ఎవరి గురించో తెలుసా..? రణ్‌వీర్ సింగ్..

బాలీవుడ్‌లో బడా నామ్ ఇది.! షారుక్, సల్మాన్ లాంటి హీరోలకు ధీటుగా ఎదుగుతాడు అంటూ చాలా మంది జోస్యం కూడా చెప్పారు. వాళ్ల జోస్యాన్ని నిజం చేస్తూ దూకుడు చూపించారు రణ్‌వీర్.

కానీ రెండేళ్లుగా ఎందుకో మరి బాగా వెనకబడిపోయారు ఈ హీరో. మునపట్లా అసలు సినిమాలు కూడా చేయట్లేదు రణ్‌వీర్. మూడు నాలుగేళ్లుగా రణ్‌వీర్ కెరీర్‌కు వరసగా షాకులు తగులుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సర్కస్, జోయేష్ భాయ్ జోర్దార్, 83 దారుణంగా బెడిసికొట్టాయి. అంతేకాదు.. కరణ్ జోహార్ తెరకెక్కించిన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ బాగానే ఆడినా.. అది రణ్‌వీర్ సింగ్ కెరీర్‌కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

ప్రస్తుతం ఈయన సింగ్ అగైన్‌లో నటిస్తున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం అగైన్‌లో రణ్‌వీర్ సోలో హీరో కాదు.. ఆయనతో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ కూడా నటిస్తున్నారు.

ఇక ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయేలా ఉంది. శంకర్‌తో కమిటైన అపరిచితుడు హిందీ రీమేక్ ఆల్రెడీ ఆగిపోయింది. మొత్తానికి రణ్‌వీర్ కెరీర్ రకరకాలుగా ఉందిప్పుడు. మరి దీన్నుంచి ఆయనెలా బయటపడతారో చూడాలిక.




