Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping On The Floor : నేలపై పడుకోవడం మంచిదా? కాదా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

మంచంపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. కానీ, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తారు చాలా మంది. అందుకే నేలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని నమ్మేవారు చాలా మందే ఉంటారు. కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి నేలపై పడుకోవడం వల్ల

Sleeping On The Floor : నేలపై పడుకోవడం మంచిదా? కాదా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Sleeping On The Floor
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 06, 2024 | 12:37 PM

నేలమీద కూర్చొని తినడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి నేలపై పడుకుంటే ఏమవుతుంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మంచం మీద హాయిగా పడుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందని, నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. నిజానికి, నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గదు. పైగా మీరు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.. మీరు నేలపై పడుకోవటం వల్ల అసలు ఏం జరుగుతుందో తెలుసా?

మంచంపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. కానీ, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తారు చాలా మంది. అందుకే నేలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని నమ్మేవారు చాలా మందే ఉంటారు. కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి అస్సలు తగ్గదని చెబుతున్నారు. దీంతో ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముకపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.. గట్టిగా ఉండే నేల ఉపరితలంపై పడుకోవడం వల్ల మీ వెన్నెముక దాని సహజ వక్రతను నిర్వహించడానికి తగినంత మద్దతు ఉండదు. దీనివల్ల కాలక్రమేణా మీ వెన్నెముక దృఢత్వం తగ్గుతుంది. అలాగే వెన్నెముక అమరిక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

నేలపై పడుకోవడం వల్ల వచ్చే మరొక సమస్య కూడా ఉంది. పరుపు లేకుండా నేలపై పడుకోవడం వల్ల మీ తుంటి, భుజం వంటి కొన్ని ప్రాంతాలు మీ శరీర బరువు భారాన్ని భరించలేకపోతుంటాయి. దీనివల్ల శారీరక అసౌకర్యం, రక్తప్రసరణ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇది కటి ప్రాంతాల్లో నొప్పి, తిమ్మిరిని కలిగిస్తుంది. ఇది మీకు రాత్రిపూట నిద్రలేకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నేలపై పడుకోవడం వల్ల శరీరానికి గాయాలయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు లేదా నిద్రమత్తులో ప్రమాదకరమైన వస్తువులను తాకడం వల్ల గాయాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే, కొంతమందికి నేలపై పడుకోని లేవడానికి కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యలు, వెన్నునొప్పి ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు, నేలపై పడుకోవడం వల్ల నిద్రకు భంగం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..