తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కోతులు పట్టు.. ఓట్లు కొట్టు అనే వినూత్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా, సైదాపూర్ మండలం, వెన్నంపల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి, ఓటర్ల అభ్యర్థన మేరకు కోతులను పట్టే వారిని నియమించారు. ఏడాదికి రూ. 3.5 లక్షల కాంట్రాక్టుతో రెండు రోజుల్లో 300 కోతులను పట్టి, అడవిలో వదిలిపెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు.